ఆ స్టార్ హీరోతో అమలాపాల్ ఎఫైర్.. బయటపెట్టిన మాజీ మామ.. ఇదిగో అసలైన క్లారిటీ
ఈ పదేళ్ల వ్యవధిలో సినిమా రంగంలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు సౌత్ ఇండియా మొత్తంలో ప్రభావాన్ని చూపించారు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. అందం, అభినయంతో రాణించిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గతంలో తనపై వచ్చిన ఓ ఆరోపణపై తాజాగా అమలా పాల్ క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
ఇక్కడ వరుసగా దెబ్బలు:అమలా పాల్ 'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా ఎంటరైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి వెళ్లిన ఆమె.. అక్కడ పలు చిత్రాల్లో నటించింది. ఇక, తెలుగులోకి మాత్రం నాగ చైతన్య నటించిన 'బెజవాడ' అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' అనే సినిమాల్లో నటించినా ఏ ఒక్కటి హిట్ కాలేదు.

డైరెక్టర్‌తో పెళ్లి, డివోర్స్:వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ ప్రేమాయణం సాగించింది. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో అగ్నిసాక్షిగా ఒక్కటైన ఈ జంట.. నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అయితే, ఆ విడాకులకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఈ క్రమంలోనే దీనిపై ఎన్నో ఊహాగానాలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి.
సెకెండ్ ఇన్నింగ్స్ ఫుల్:భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని జెట్ స్పీడుతో సినిమాలు చేస్తోంది. ఇలా ఇప్పుడు చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె రెండో పెళ్లి కూడా చేసుకుంది. అలాగే తల్లి కాబోతుంది.

ధనూష్ వల్లే విడాకులు:అమలా పాల్ - విజయ్ విడాకులు తీసుకోడానికి అసలు కారణం ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే, ఆ మధ్య విజయ్ తండ్రి అళగప్పన్ మాత్రం దీనిపై స్పందించారు. తన కొడుకు కోడలు విడాకులు తీసుకోవడానికి కారణం తమిళ స్టార్ హీరో ధనూష్ అంటూ ఆయన షాకిచ్చారు. అతడి విషయంలో అమలా పాల్ తమను ఎదిరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బాంబ్ పేల్చారు.
క్లారిటీ ఇచ్చిన అమలా:అళగప్పన్ చేసిన ఆరోపణలపై చాలా కాలం పాటు అటు ధనుష్ గానీ, ఇటు విజయ్, అమలా పాల్ గానీ స్పందించలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ హీరోయిన్ సమాధానం చెప్పేసింది. ఈ క్రమంలోనే మాజీ మామ చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన అమల పాల్.. తమ విడాకులకు కారణం ధనూష్ ఏమాత్రం కాదని మరోసారి స్పష్టం చేసేసింది.

ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చేసి:మాజీ మామ కామెంట్ల తర్వాత ధనూష్‌తో అమలా పాల్ ఎఫైర్ పెట్టుకున్నట్లు టాక్ వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో దీనిపై హీరోయిన్ స్పందిస్తూ.. 'ధనూష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. స్టార్ హీరోనే అయినా అందరితో కలివిడిగా ఉంటాడు. అందుకే అతడితో బాండింగ్ ఏర్పడింది. భవిష్యత్‌లో మా ఇద్దరి బంధం చాలా దూరం వెళ్తుంది' అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది.


Click it and Unblock the Notifications











