Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న మన దర్శకుడు
రానున్న రోజుల్లో ఇండియన్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా భారీ స్థాయిలో రిలీజ్ కాగలవని అర్ధమయ్యింది. గత కొంత కాలంగా టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు యూఎస్ ఏషియా కంట్రీస్ లలో భారీ వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక అలాంటి బాక్సాఫీస్ హిట్ అందుకోగల సత్తా ఉన్న దర్శకుల్లో మురగదాస్ ఒకరు. ఈ మధ్య హవా తగ్గినప్పటికీ మళ్ళీ పదునైన స్టోరీ దొరికితే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించగలడని చెప్పవచ్చు.
ఇక మురగదాస్ త్వరలో హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా డిస్ని పిక్చర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. యాక్షన్ యానిమేషన్ తరహాలో ఆ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితమే కథను రెడీ చేసుకున్న మురగదాస్ ఇటీవల డిస్ని సంస్థతో జరిపిన చర్చల్లో కథను చెప్పి మెప్పించినట్లు సమాచారం. ఆ సినిమా ద బ్యూటీ అండ్ బీస్ట్ తరహాలో ఉంటుందని టాక్. అయితే ఈ ప్రాజెక్టు పై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఇక దర్శకుడు మురుగదాస్ చివరగా రజినీకాంత్ తో దర్బార్ సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక తన ఫేవరేట్ హీరో ఇలయదలపతి విజయ్ తోనే మరో సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. కానీ రీసెంట్ గా ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లు మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన హీరో ప్రాజెక్టును క్యాన్సిల్ చేసినట్లు కథనాలు గట్టిగానే వచ్చాయి. అయితే వాటిపై ఇంతవరకు హీరో దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.