KGF 2పై స్టార్ డైరెక్టర్ శంకర్ రివ్యూ.. యష్ షాకింగ్ రియాక్షన్!

ఇటీవల విడుదలైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాప్టర్ వన్ అందించిన విజయంతో చిత్ర యూనిట్ సభ్యులు రెండవ చాప్టర్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకువచ్చారు. ఇక ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలను సృష్టించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం. హీరో యష్ స్టైల్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ సినిమాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువస్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ సినిమాను చూసిన కొంతమంది సినీ ప్రేక్షకులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మొత్తానికి తమిళ అగ్ర దర్శకుడు అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కూడా ఈ సినిమా చూసిన తరువాత తనదైన శైలిలో రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి కేజిఎఫ్ 2 సినిమా చూడడం జరిగింది అంటూ.. కటింగ్ ఎడ్జ్ స్టైల్ స్టోరీ టెల్లింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఎడిటింగ్ పవర్ఫుల్ గా ఉన్నాయి అంటూ బోల్డ్ మూవీ అని యాక్షన్ డైలాగ్స్ కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాయి అని వివరణ ఇచ్చారు.

Star director shankar review on KGF 2 movie and hash reaction

అన్ని కూడా ఈ సినిమాకు బ్యూటిఫుల్ గా కుదిరాయి అంటూ హీరో యష్ మాస్ పవర్ హౌస్ అని అలా చూపించినందుకు దర్శకుడు ప్రశాంత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంచి అనుభూతి కలిగింది అని అలాగే సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన అన్బ్ అరివ్ కూడా వర్క్ చేసినట్లు తెలిపారు. మొత్తంగా చిత్ర యూనిట్ సభ్యుల పనితనానికి శంకర్ ఫిదా అయ్యారు.

ఇక దర్శకుడు శంకర్ ఆ విధంగా క్లారిటీ ఇవ్వగానే హీరో కూడా చాలా సంతోషించాడు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మేము ఎప్పటికీ ఒకటే చెబుతూ ఉంటాము.. మీరు మాకు గొప్ప ప్రేరణ అని మీరు చెప్పిన ఈ పదాలు ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తానని హీరో యష్ ట్విట్టర్లో ప్రతిస్పందించారు. చాలామంది కన్నడ అభిమానులు కూడా శంకర్ ఇచ్చిన వివరణ కు ఫిదా అవుతున్నారు.

శంకర్ తనకు ఏ సినిమా నచ్చిన కూడా ఏలాంటి బేధాభిప్రాయాలు చూపకుండా వారి మెచ్చుకుంటారు. చిన్న సినిమాలకు కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఒక తెలుగు హీరోతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి శంకర్ ఆ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X