శంకర్ మల్టీస్టారర్ ప్లాన్.. KGF హీరోతో పాటు మరో కోలీవుడ్ స్టార్
సౌత్ ఇండస్ట్రీలో బిగ్ బడ్జెట్ సినిమాలను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన స్టార్ డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అసలైతే ఇండియన్ 2 సినిమాతో ఎలాగైనా వచ్చే ఏడాది బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకున్న శంకర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనందున మరో సినిమాను సెట్స్ పైకి తెస్తాడా లేదా అనే విషయం బిగ్ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 విషయంలో ఇప్పటికే శంకర్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని లేకుంటే మరో ప్రాజెక్టును చేసుకోమ్మని అనుమతి ఇవ్వడంతో ఫైనల్ గా ఒక కథను రెడీ చేసుకున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి ఒక బడా మల్టీస్టారర్ ని తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ సెట్ చేసుకున్నారట. ఇక ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు KGF స్టార్ యష్ తో పాటు కోలీవుడ్ టాలెంటేడ్ యాక్టర్ విజయ్ సేతుపతి అని తెలుస్తోంది. తెలుగు నుంచి కూడా ఒక యువ హీరో ఆ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వీలైనంత వరకు సినిమా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలోనే ఇవ్వాలని అనుకుంటున్నారట. తమిళనాడులో ఇప్పటికే షూటింగ్స్ మొదలయ్యాయి. ఇక శంకర్ కూడా షూటింగ్ తో కావాలని ఈ మల్టీస్టారర్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచినట్లు టాక్. ఇక దాదాపు ఇండియన్ 2 సినిమా విషయంలో శంకర్ ఇంట్రెస్ట్ కోల్పోయినట్లు తెలుస్తోంది. అసలు సినిమా మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా అనుమనంగానే ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











