తోటి బైకర్‌కు స్పోర్ట్స్ బైక్ గిఫ్టుగా ఇచ్చిన స్టార్ హీరో.. దాని విలువ ఎంతో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. తనదైన నటనతో, యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుంటాడు. దాదాపుగా రియల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తూ అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తుంటాడు. అందుకే ఆయన్ను ముద్దుగా తలా అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. అయితే సినిమాల్లోనే కాకుండా బయట కూడా అజిత్ అడ్వెంచర్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన బైక్ టూర్ లో ఉన్నారు. అయితే ఈ క్రమంలో తోటి బైకర్‌కు అజిత్ సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చిన బైక్ ధర హాట్ టాపిక్ గా మారింది.
ఓటీటీలో మాత్రం: తమిళ స్టార్ హీరో అజిత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయనకు తెలుగులో కూడా కొంతమేర ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ అప్పుడ్పుడు విడుదలై సందడి చేస్తుంటాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తెగింపు సినిమాతో వచ్చాడు. ఆ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోనప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది.

తోటి బైక్ రైడర్: అయితే ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అజిత్ బైక్ పై అడ్వెంచర్ టూర్ ప్లాన్ చేశారు. ఇటీవలే నేపాల్, భూటాన్ లలో బైక్ టూర్ పూర్తి చేశారు. ఈ బైక్ టూర్ లో తర్వాతి స్టేజ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తనతోపాటు నేపాల్ లో రైడ్ చేసిన సుగత్ సత్పతి అనే తోటి బైక్ రైడర్ కు సూపర్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు అజిత్.

బైక్ విలువ: సుగత్ సత్పతికి బీఎండబ్ల్యూ ఎఫ్850 జీఎస్ అనే బైక్ ను గిఫ్టుగా ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు తలా అజిత్. అయితే అజిత్ లేటెస్ట్ బైక్ టూర్ ను సుగత్ ఆర్గనేజ్ చేశాడు. ఈ సందర్భంగా అతనికి ఈ బైక్ బహుమతిగా ఇచ్చారు. దాని విలువ రూ. 12.5 లక్షలు ఉంటుంది. ఈ బీఎండబ్ల్యూ ఎఫ్ 850 జీఎస్ ధర పన్నెండున్నర లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

బైక్ రైడింగ్ ఇష్టం: కాగా ఈ నెల ప్రారంభంలోనే అజిత్ భారతదేశంలో తన బైక్ టూర్ పూర్తి చేశారు., దీంతోపాటు నేపాల్, భూటాన్ లలో బైక్ టూర్ పూర్తి అయింది. అజిత్ కు ఇప్పటికి రెండు సార్లు బైక్ టూర్ ఆర్గనైజ్ చేసినట్లు సుగత్ సత్పతి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. "2022లో నాకు అదృష్టం కలిసి వచ్చింది. తమిళ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్లలో ఒకరైన అజిత్ కుమార్ ను కలిశాను. ఆయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం" అని పేర్కొన్నాడు.
అన్నలాగా..: "ఇక్కడ ఉన్న బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ నాకెంతో ప్రత్యేకమైనది. దాన్ని అజిత్ గిఫ్టుగా ఇచ్చారు. అవును, దాన్ని ఆయన నాకు ఎంతో ప్రేమగా కానుకగా ఇచ్చారు. ఆయన రెండోసారి కూడా ఆలోచించలేదు. ఈ అందమైన బైక్ నా దగ్గర ఉండాలని ఆయన అనుకున్నారు. దీంతో ప్రపంచాన్ని చుట్టేయచ్చు. నా జీవితంలో ఆయన పాత్ర గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. నన్ను ఒక అన్నలాగా చూసుకున్నారు. నువ్వు బెస్ట్ అన్నా" అని కూడా రాసుకొచ్చాడు సుగత్.


Click it and Unblock the Notifications











