ఆ స్టార్ హీరో ఇలా అయ్యాడేంటీ.. సిక్స్ ప్యాక్ పోయి ఆ పొట్టతో దర్శనం... షాక్‌లో ఫ్యాన్స్?
సినిమా ఇండస్ట్రీ అంటేనే.. రంగుల ప్రపంచం.. ఆ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే.. కాసింత అందం, బాడీ ఫిట్నెస్ ఉండాల్సిందే. మరి అందులోనూ హీరో అంటే.. సిక్స్ ప్యాక్ లేకపోయినా... జీరో సైజ్ పొట్టతో ఉండాల్సిందే. నిన్న మొన్నటి వరకు సిక్స్ ప్యాక్ తో ట్రెండీ లుక్ తో ఉండే ఓ స్టార్ హీరో సడెన్ గా మారిపోయారు. ఎంతలా అంటే గుర్తు పట్టలేని స్థితిలోకి మారారు. సిక్స్ ప్యాక్ పోయి... పొట్ట దర్శనం ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టార్ హీరో ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...
స్టార్ హీరో.. నిన్న మొన్నటి వరకు సిక్స్ ప్యాక్, స్టైలిష్ లుక్ ఉండే అతను ఒక్కసారిగా పొట్టతో దర్శనం ఇస్తున్నారు. అంతే కాదు.. హెయిర్ తెల్లటి రంగులోకి మారిపోయింది. ఫేస్ లో మార్పులు వచ్చేశాయి. ఫ్యాన్స్ సైతం గుర్తు పట్టలేని స్థితిలోకి మారారు. ఆయన ఎవరు అనుకుంటున్నారా.. ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అజిత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

అజిత్ కుమార్త తన వైట్ హెయిర్ కు కలర్ వెయ్యకుండా అలాగే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. హీరో అంటే ఇలానే ఉండాలి అనే ఒక పద్దతిని మార్చేసిన హీరో అజిత్. అయితే ఫిట్నెస్ విషయంలో అలెర్ట్ గా ఉండే వ్యక్తి. మరి సడెన్ గా ఆయన బాడీలో మార్పులు వచ్చాయి. ఈ మధ్య పొట్టతో దర్శనం ఇస్తున్నారు. దీనితో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతే కాదు.. ఫేస్ లోనూ మార్పులు రావడంతో.. ఇదేంటీ ఇలా అయ్యారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం అజిత్ సినిమాలను పక్కన పెట్టి వరల్డ్ టూర్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలను తిరుగుతూ ..అక్కడ జనాలతో.. అక్కడ ఆచారాలను ఫాలో అవుతూ కనిపిస్తూ ఉన్నారు అజిత్. తాజాగా అజిత్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలు ఎక్కడ అనేది క్లారిటీ లేదు కానీ.. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక ఆ ఫోటోల్లో సడెన్ గా చూస్తే.. అజిత్ అని గుర్తు పట్టడానికి చాలా సమయం పడుతుంది. అభిమానులు కూడా గుర్తు పట్టేందుకు టైం పట్టేలా ఉన్నాయి ఆ ఫోటోస్. నెరిసిన జుట్టు, గడ్డం, కళ్లకింద ముడతలు, నలిగిపోయిన ముఖం, అంతే కాదు.. సిక్స్ ప్యాక్ మెయిన్ టైన్ చేసే అజిత్ కు పొట్ట... దీనితో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అజిత్ వయస్సు 52. ఒకప్పుడు యంగ్ గా కనిపించే ఈ హీరో... ఇప్పుడు ఈ ఫోటోల్లో మాత్రం ముసలి వాడిలా దాదాపు 70ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నారు.
ఇక అజిత్ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడుతుంటే... కొందరు మాత్రం.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే చాలా మంది వరల్డ్ టూర్ ఎఫెక్ట్.. ప్రయాణాలు చేయడం వల్లే ఇలా అయ్యిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మళ్లీ అజిత్ సినిమాల్లోకి ఎప్పుడూ వస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











