పొట్టతో దర్శనం ఇచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్.. నెటిజన్స్ ఏమన్నారంటే?

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ వరల్డ్ లో ఎంత అందంగా కనిపిస్తే అంత మంచి అవకాశాలు వస్తాయి. అందుకే హీరోయిన్లు చక్కటి ఫిజిక్ మెయింటేన్ చేస్తూ గ్లామర్ ఒలకబోస్తూ క్రేజీ ఆఫర్లు కొట్టేస్తుంటారుర. అలాగే హీరోలు సైతం కండలు తిరిగిన దేహంతో కనిపించేందుకు తెగ కసరత్తులు చేస్తుంటారు. యంగ్ కనిపించినన్ని రోజులు హీరోలా చూస్తారు ఆడియెన్స్. అదే వయసు వచ్చినట్లు కొంచెం అనిపించినా సరే సపోర్టింగ్ పాత్రలతో సరిపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఈ చర్చ ఎందుకనే వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో సైతం అభిమానులు ఉన్నారు. తనదైన నటనతో, యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుంటాడు. సినిమాల్లో దాదాపుగా రియల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తూ అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తుంటాడు. అందుకే ఆయన్ను ముద్దుగా తలా అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. అయితే సినిమాల్లోనే కాకుండా బయట కూడా అజిత్ అడ్వెంచర్స్ చేస్తారన్న విషయం తెలిసిందే.

Star Hero Ajith Kumar Captured With Big Belly Fat In Airport

అజిత్ కు బైక్ లంటే అమితమైన ఇష్టం. అందుకే అప్పుడప్పుడు బైక్స్ పై రైడ్ వేస్తుంటారు. ఇటీవల కూడా సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి అలా రైడ్ వేసి వచ్చాడు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ, తాజగా అజిత్ ఓ ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే హీరో కనిపిస్తే సంతోషమే కదా అనుకుంటున్నారేమో. కానీ అజిత్ లేటెస్ట్ లుక్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

Star Hero Ajith Kumar Captured With Big Belly Fat In Airport

లేటెస్ట్ వీడియోలో లగేజ్ చేత్తో పట్టుకుని రెడ్ కలర్ టీ షర్ట్ లో వెళ్తున్న అజిత్ ను చూసి కొంతవరకు అభిమానులు నమ్మలేకపోయారు. అజిత్ ఊహించని విధంగా ఫ్యామిలీ ప్యాక్ అదేనండి పొట్టతో దర్శనం ఇచ్చాడు. ఎంతో ఫిట్ గా ఉండే అజిత్ అలా పొట్టతో కనిపించేసరికి ఆడియెన్స్ నివ్వెరపోయారు.

అతను అజితేనా అని అనుమానిస్తున్నారు. దీంతో ఆయనపై కాస్తా ట్రోలింగ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఆయన స్టైల్ ను పొగుడుతున్నారు. అలాగే తన లెగేజ్ తానే మోసుకెళ్లే సింప్లిసిటీని చూసి మెచ్చుకుంటున్నారు. కాగా ఇటీవల అజిత్ తునివు తెలుగులో తెగింపు అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X