twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బైక్ పై స్టార్ హీరో వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    |

    కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా వారందరికీ కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇక రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్స్ తరువాత అత్యదిక ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ఈ స్టార్ హీరో కమర్షియల్ సినిమాలతో ఎక్కువగా అభిమానులకు వెండితెర విందు భోజనాన్ని అందిస్తుంటాడు. అయితే ఈ హీరోకు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నాయి. ఇటీవల బైక్ నడుపుకుంటు ఏకంగా వేల కిలోమీటర్లు దాటుకుంటూ వెళ్లిపోయాడు.

    Recommended Video

    Ajith Heads To Sikkim By Bike For 4000-km Road Trip | Filmibeat Telugu
     వంద కోట్లకు తక్కువ కాకుండా..

    వంద కోట్లకు తక్కువ కాకుండా..

    తమిళ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ను పవర్ఫుల్ గా సెట్ చేసుకుంటున్న అజిత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వంద కోట్లకు తక్కువ రాబట్టవు. గత 5 సినిమాలు కూడా వరుసగా వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకొని న్యూ రికార్డు క్రియేట్ చేశాయి. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండే అజిత్ కనీసం అభిమానులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే పనులు చేయనివ్వడు.

     సినిమాలో వాడిన బైక్ పైనే.. ఇంటికి

    సినిమాలో వాడిన బైక్ పైనే.. ఇంటికి

    పర్సనల్ లైఫ్ తో అజిత్ చాలా బిజీగా ఉంటాడు. ఇక ఈ హీరోకు బైకుల పిచ్చి చాలా ఎక్కువ. కొన్నిసార్లు షూటింగ్స్ కు బైక్ పైన కూడా వస్తుంటాడు. లొకేషన్స్ వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా కూడా లెక్క చేయడు. ఒకసారైతే హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చి సినిమాలో వాడిన బైక్ పైనే చెన్నైకు వెళ్లిపోయాడు. అజిత్ కు బైక్ నచ్చింది అంటే అస్సలు వదిలిపెట్టడు.

    బీఎండబ్ల్యూ బైక్ పై వారాణసి

    బీఎండబ్ల్యూ బైక్ పై వారాణసి

    ఇక చాలా రోజుల తరవాత అజిత్ ఒక లాంగ్ టూర్ వేశాడు. బైక్ రేసులో పాల్గొన్న అనుభవం కూడా ఉన్న అజిత్ చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తుంటారు. అయితే రీసెంట్ గా తన బీఎండబ్ల్యూ బైక్ పై వారాణసిని టార్గెట్ చేశాడు. చెన్నై నుంచి వారణాసి వెళ్లిన అజిత్ అనంతరం అక్కడి నుంచి సిక్కిం వెళ్లనున్నాడు.

    మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే..

    మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే..

    కొన్నిరోజులు మధ్యలో రెస్ట్ తీసుకొని మళ్ళీ చెన్నైకు అదే బైక్ పై చేరుకుంటాడు. రీసెంట్ గా వారణాసిలో ఒక అభిమానితో కూడా ఫొటో దిగాడు. ఆ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రోడ్ ట్రిప్ లో మొత్తంగా అజిత్ 4500 కిలోమీటర్లు ప్రయాణం చేసి రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ హీరో H వినోథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వలిమై అనే ఆ సినిమా ఈ ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    No matter how many star heroes there are in the Kollywood industry, they all have millions of fans. Ajith is the most followed hero after stars like Rajinikanth and Vijay. This star hero serves a silver screen dinner mostly to the fans with commercial movies. However this hero has some unique habits. Recently the bike rider walked thousands of kilometers in one go.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X