గుండు చేయించుకున్న ధనుష్.. బాడీ గార్డులు అత్యుత్సాహం.. శ్రీవారి సేవలో అలా!
కేవలం దక్షిణాదిలోనే కాకుండా హిందీ, హాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న తమిళ స్టార్ హీరో ధనుష్. హిందీలో రాంఝానా, ఆత్రంగి రే వంటి మంచి హిట్స్ అందుకున్న ధనుష్ గతేడాది ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో నెగెటివ్ రోల్ తో ఇంప్రెస్ చేశాడు. ఈ ఏడాది బైలింగువల్ సినిమా సార్/వాతితో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల ధనుష్ పై తమిళ నిర్మాతల మండలిపై ఫిర్యాదు నమోదు కాగా తాజాగా ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలను దర్శించుకున్నాడు. శ్రీవారి సేవలో పాల్గొని తలనీలాలు సమర్పించుకున్నాడు.
విలక్షణ నటన:ఎంతో కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన గుర్తింపు పొందాడు స్టార్ హీరో ధనుష్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటాడు. విలక్షణ నటనతో అదరగొట్టే ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవల సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ధనుష్.

మెసేజ్ కథ:వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సార్ సినిమా స్కూల్స్, విద్యా వ్వవస్థ అనే మెసేజ్ కథాంశంతో తెలుగు ప్రజలకు చేరువైంది. ఇటీవల ధనుష్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయకుండా ఆలస్యం చేస్తున్నందుకుగాను ధనుష్ పై తమిళ నిర్మాత మండలిలో (TFPC) ఫిర్యాదులో నమోదు అయింది.

హీరోపై చర్యలు:చర్యలు తీసుకునేందుకు ధనుష్ పై రెడ్ కార్డ్ కూడా జారీ చేస్తారని తమిళ చిత్ర వర్గాల నుంచి టాక్ అయితే వచ్చింది. దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా ధనుష్ తిరుమలలో సందడి చేశాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలను ఎంతో మంది సెలబ్రిటీలు దర్శించుకుంటారన్న విషయం తెలిసిందే.
మెడలో రుద్రాక్ష:తాజాగా ధనుష్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నాడు. ఆయన కుమారులతో పాటు తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నాడు. మొక్కులో భాగంగా తల నీలాలు సమర్పించుకున్నాడు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నాడు. దర్శనాంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆగ్రహం:బ్లూ కలర్ షర్ట్ లో మెడలో రుద్రాక్ష మాలతో ధనుష్ కనిపించాడు. అయితే కేవలం గుండు మాత్రమే చేయించుకున్న ధనుష్ క్లీన్ షేవ్, మీసంతో దర్శనం ఇచ్చాడు. ఇక ధనుష్ ను చూసేందుకు అతినితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో ధనుష్ బాడీగార్డులు అత్యుత్సాహం చూపించారు. దీంతో వీడియో చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ కింద పడినట్లు సమాచారం. దీంతో ధనుష్ బాడీగార్డులపై మీడియా కమెరామెన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











