ఇండియన్ 2 గొడవ.. మొత్తానికి రంగంలోకి దిగిన స్టార్ హీరో

ఇండియన్ 2 సినిమా కోసం ఓ వైవు తమిళ్ అడియెన్స్ మరోవైపు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్ళీ శంకర్ స్టామినాను కూడా బిగ్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నారు. కానీ అంత పెద్దా బడా డైరెక్టర్ కు ఇప్పుడు నిర్మాతలతో ఇబ్బందులు ఎదురవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా శంకర్ అనగానే ఒకప్పుడు లెక్కకు మించి బడ్జెట్ పెట్టేవారు.

కానీ ఇప్పుడు ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్లుగా క్లిక్కవ్వకపోవడం నిర్మాతలు డేర్ చేయలేకపోతున్నారు. ఇండియన్ 2 విషయంలో అసలు గొడవ అదే. అనుకున్న బడ్జెట్ కాకుండా ఇంకాస్త ఎక్కువ పెంచుతున్నారని ముందు నుంచి లైకా సంస్థ అసంతృప్తితోనే ఉంది. ఇక విషయం కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి మాట్లాడుకొని పరిష్కరించుకుంటే ఇరువురికి మంచిది అని వివరణ ఇచ్చారు.

Star hero Kamal Hassan mediating on indian 2 issue

ఇక మొత్తానికి ఎలక్షన్స్ హడావుడి తగ్గడంతో కమల్ హాసన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్, శంకర్ లతో రెగ్యులర్ గా మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా సమస్యను పరిష్కరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో కమల్ హాసన్ వలనే షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఇక యాక్సిడెంట్ తరువాత కోవిడ్ ఎఫెక్ట్ వలన మరింత అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వాటిని మర్చిపోయి కలిసి కట్టుగా వర్క్ చేయాలని కమల్ హాసన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X