ఉప్పెన రీమేక్.. ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన స్టార్ హీరో తనయుడు
కరోనా దెబ్బకు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాల జాతకాలు మారిపోయాయి. ఇన్ని రోజులు కష్టపడి చేసిన సినిమాలు ఒక్కసారిగా పెండింగ్ లో పడ్డాయి. లాక్ డౌన్ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ సమయంలో సినిమాకు ప్రమోషన్స్ చేద్దామన్నా కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. అయితే సినిమాలపై వస్తున్న కొన్ని రూమర్స్ జనాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా పరిచయం కానున్న మరొక హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పుడు తన సినిమాకు సంబంధించిన గాసిప్స్ తోనే హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఆ రూమర్స్ ని పక్కనపెడితే ఉప్పెన కథ విజయ్ సేతుపతికి బాగా నచ్చినందుకే నెగిటివ్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ కథను తమిళ్ లో రీమేక్ చేయడానికి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జసోన్ సంజయ్ ని హీరోగా పరిచయం చేయడానికి కథలు వెతుకుతున్నారని తెలిసి విజయ్ సేతుపతి ఆ స్టార్ హీరోకి ఉప్పెన కథ గురించి చెప్పారట. థలపతి విజయ్ మాస్టర్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సింపుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని సేతుపతి చెప్పడంతో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న సంజయ్ ని ఇంటికి తీసుకురావడానికి విజయ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











