విక్రమ్ ని భయపెడుతున్న సూర్య సెవెంత్ సెన్స్..!
తమిళంలో ఎప్పుడూ ఏదో ప్రయోగాత్మక చిత్రాలతో అలరించే హీరోలలో ఎప్పుడూ ముందుండే హీరోలు సూర్య, విక్రమ్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సూర్యకు విక్రమ్ బాగా భయపడుతున్నాడని శిశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సెవెన్త్ సెన్స్". మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటకిే తెలుగు, తమిళ భాషలతో పాటుగా హిందీలో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ చిత్రంలో సూర్య దాదాపు 7పాత్రలలో కనిపించి కనువిందు చేయబోతున్నాడు.
అదే విధంగా ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాజ పట్టై". ఈ చిత్రంలో విక్రమ్ ఒక పాటలోనే పది గెటప్ లతో అలరించబోతున్నాడు. అయితే ఈ చిత్రంపై విక్రమ్ కూడా చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. మల్లన"చిత్రం తర్వాత విక్రమ్ నటిస్తున్న మరో వైవిధ్య భరితమైన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందోనని కాస్త టెన్షన్ గానే ఉన్నాడు. అయితే మరి 'సెవెన్త్ సెన్స్"దాటికి విక్రమ్ 'రాజపెట్టై" తట్టుకుంటుందా లేదా మల్లన్న లా కుదేళౌతుందో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











