twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కె.బాలచందర్‌కు విగ్రహం...వీధికి పేరు

    By Srikanya
    |

    చెన్నై : 'దర్శక శిఖరం' కె.బాలచందర్‌కు మైలాపూర్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దర్శకుడు భారతీరాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో సంతాపసభ మంగళవారం నిర్వహించింది. సంఘం అధ్యక్షుడు విక్రమన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలచందర్‌ చిత్రపటాన్ని భారతీరాజా ఆవిష్కరించారు.

    అనంతరం భారతీరాజా మాట్లాడుతూ.. బాలచందర్‌ మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జీవించిన మైలాపూర్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. వారు నివసించిన వీధికి 'బాలచందర్‌' పేరు పెట్టాలని కోరారు. ఇకపై బాలచందర్‌ను జ్ఞప్తికి తెచ్చుకునేలా ప్రతి ఏటా ఆయన పేరిట అవార్డును కూడా అందజేయనున్నట్లు చెప్పారు. బాలచందర్‌ ఖ్యాతిని చాటే రీతిలో ఫిబ్రవరిలో వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Statue for legendary director K.Balachandar

    ఈ సందర్భంగా థియేటర్లలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను ప్రదర్శింపజేయనున్నామని అన్నారు. అలాగే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలను ప్రదర్శించి.. ఉత్తమ చిత్రానికి బాలచందర్‌ పురస్కారాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విక్రమన్‌, ఆర్‌కే సెల్వమణి, బాలచందర్‌ కుమార్తె పుష్పా కందస్వామి, నిర్మాత ఎస్‌.థాణు తదితరులు పాల్గొన్నారు.

    గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.బాలచందర్...ఈ మధ్యనే చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1930 జులై 9న జన్మించిన ఆయన పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. ‘నీర్‌ కుమిళి' (1965)తో దర్శకుడైన బాలచందర్‌ తెలుగులో ఆయన తొలి చిత్రం ‘భలే కోడలు', ‘అంతులేని కథ'తో తెలువారి మదిని దోచుకున్నారు. అలాగే బాలచందర్‌ తొలి తెలుగు స్టయిల్‌ చిత్రం ‘మరో చరిత్ర'. ప్రఖ్యాత నటులు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లను తీర్చిదిద్దిన బాలచందర్‌ తన చిత్రాల ద్వారా ఎందరికో జీవితం ప్రసాదించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శక, నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

    45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు. ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.

    English summary
    The Directors Council held a condolence meeting at their premises today to condole the death of the legendary director, K Balachander. During this event, some resolutions were passed and most important of them was the request to the state government to unveil K Balachander’s statue at Luz Corner in Chennai as a mark of respect.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X