కార్తీ సర్దార్ 2 షూటింగులో దుర్ఘటన.. 20 అడుగుల నుంచి పడి స్టంట్‌మన్ మృతి
తమిళ స్టార్ హీరో కార్తీ మూవీ షూటింగులో భారీ ప్రమాదం జరిగింది. చెన్నైలోని ప్రముఖ స్టూడియోలో జరుగుతున్న ఈ షూటింగులో అపశృతి చోటు చేసుకోవడంతో స్టంట్‌మెన్ మరణించాడు. ఈ ఘటన చిత్ర యూనిట్‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇటీవల భారీ విజయం అందుకొన్న సర్దార్ సినిమాకు సీక్వెల్‌గా సర్దార్ 2 రూపొందుతున్నది. ఈ సినిమా షూటింగు చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరుగుతున్నది. 20 అడుగుల ఎత్తులో ఉన్న స్టంట్ మెన్ ప్రమాద వశాత్తూ కిందపడిపోయాడు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆస్పత్రికి తరలించగా రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.

స్టంట్‌మెన్ ప్రమాదానికి గురి కావడంతో చిత్ర యూనిట్ షాక్‌లో ఉండిపోయింది. వెంటనే షూటింగ్ నిలిపివేసి సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని సినిమా యూనిట్ తెలిపింది. సర్దార్ 2 సినిమా షూటింగ్ మూడు రోజుల క్రితమే ప్రారంభమైంది.

స్టంట్‌మెన్ ఎలుమలై మరణించాడని తెలియజేయడానికి చింతిస్తున్నాం. సర్దార్ 2 సినిమా షూటింగులో ఈ దుర్ఘటన జరిగింది. జూలై 16వ తేదీ సాయంత్రం యాక్షన్ సీన్లు షూట్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకొన్నది. దాంతో వెంటనే మూర్తి స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించాం. చికిత్స అందుతుండగా తుదిశ్వాస విడిచారు. ఎలుమలై మరణం తీవ్రంగా బాధిస్తున్నది అని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











