పగలు స్టంట్స్ మెన్..రాత్రిళ్లు దొంగ...అరెస్టు

పోలీసుల కథనం మేరకు..వలసరవాక్కం ప్రాంతంలో తరచూ జరుగుతున్న దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి వలసరవాక్కం అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
ఈ క్రమంలో గత 19వ తేదీన ఒకరి నుంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోతున్న వ్యక్తిని ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. పోలీసులు జరిపిన విచారణలో అతడి పేరు జాన్సన్ (36) అని తిరువళ్లూరు జిల్లా రాజాజిపురానికి చెందిన వాడని తెలిసింది.
అతడు సినిమా, టీవీ సీరియళ్లలో చిన్న చిన్న రౌడీ వేషాలు వేసేవాడని, విలాసాలకు అలవాటు పడి ఇలా దొంగతనాలకు పాల్పడేవాడని వెల్లడైంది. అతడి నుంచి 25 సవర్ల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











