twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పగలు స్టంట్స్ మెన్..రాత్రిళ్లు దొంగ...అరెస్టు

    By Srikanya
    |

    Stuntman by day, chain-snatcher by night arrested
    చెన్నై : మహిళల నగలను చోరీ చేసిన సినీ స్టంట్ మెన్ ని పోలీసులు అరెస్టు చేశారు. తమిళ సినిమాలో చాలా వాటిల్లో డేరింగ్ స్టంట్స్ చేసిన జాన్సన్ ..రాత్రిళ్లు దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి పోయాడు. రోజుకు సంపాదించే ఏడిమెది వందలు సరిపోవటం లేదని ఇలా దొంగతనాలు ప్రారంభించి దొరికిపోయాడు.

    పోలీసుల కథనం మేరకు..వలసరవాక్కం ప్రాంతంలో తరచూ జరుగుతున్న దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి వలసరవాక్కం అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

    ఈ క్రమంలో గత 19వ తేదీన ఒకరి నుంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోతున్న వ్యక్తిని ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. పోలీసులు జరిపిన విచారణలో అతడి పేరు జాన్సన్ (36) అని తిరువళ్లూరు జిల్లా రాజాజిపురానికి చెందిన వాడని తెలిసింది.

    అతడు సినిమా, టీవీ సీరియళ్లలో చిన్న చిన్న రౌడీ వేషాలు వేసేవాడని, విలాసాలకు అలవాటు పడి ఇలా దొంగతనాలకు పాల్పడేవాడని వెల్లడైంది. అతడి నుంచి 25 సవర్ల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

    English summary
    Johnson, who also donned the roles of small-time rowdies in many films, earned 700 to 800 a day, whenever he got work. "He had acted in some television serials, including 'Athipookal' and 'Mutharam', and with the money earned from snatching chains, he had set up a gym and a beauty parlour for his wife in Thiruvallur," said inspector Elangovan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X