సెక్సీ లెక్చరర్ గా నయనతార!

By Staff

Nayantara
నయనతార ఇప్పుడు సెక్సీ లెక్చరర్ గా ఆగిన్ అనే చిత్రంలో అదరకొట్టడానికి రెడీ అవుతోంది. అయితే ఇంతకుముందు మనమంతా ఇలియానా ను ఆ తరహా పాత్రను చూసాం. ఎక్కడా అంటే ఖతర్నాక్ సినిమాలో. హిందీలో సుస్మితాసేన్ చేసిన మై హూనా చిత్రంలోంచి ఆ పాత్రను అప్పుడు లిప్ట్ చేసారు . ఇప్పుడు అదే సినిమాను తమిళ్ లో రైట్స్ కొని Aegan పేరుతో రీమేక్ చేస్తున్నారు.Aegan అంటే శివుడు అని అర్ధం. ఇక ఆ చిత్రంలో ఏజ్ డ్ గా ఉన్న హీరో కాలేజీలో చేరితే అక్కడుండే ముదురు హీరోయిన్ తన అందాలను ఆరబోసి అతన్ని ఆకట్టుకుంటుంది.

హిందీలో షారూఖ్ చేసిన ఆ పాత్రను అజిత్ తమిళ్ లో చేయనున్నాడు. అతని తమ్ముడుగా తెలుగు నటుడు నవదీప్ కనపడతాడు. ఇంతకుముందు కూడా నవదీప్ 'Arindhum Ariyamalum' అనే తమిళ చిత్రంలో చేసి మెప్పించాడు. ప్రముఖ నృత్య దర్శకుడు రాజు సుందరం ఈ సినిమాను తొలిసారిగా డైరక్ట్ చేస్తున్నాడు. అజిత్...భిళ్ళా తర్వాత నయనతారతో జతగట్టి చేస్తున్న సినిమా కావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు,మళయాళ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా దీపావళి పండుగ గిఫ్టు గా రానుంది. అప్పుడు మనం అంచనా వేయవచ్చు. సుస్మితా బెటరో,నయనతార బెటరో లేక ఇలియానా సూపరో...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X