Suchi Leaks ఆ స్టార్ హీరోయిన్‌తో ధనుష్ డేటింగ్.. ఐశ్వర్యను అలా మోసం.. బాంబు పేల్చిన సుచిత్ర
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ పై సింగర్ సుచిత్ర మళ్ళీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారంటూనే, ఐశ్వర్య కంటే ధనుష్ నయమని కామెంట్స్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికే విడాకుల బాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా గాయని సుచిత్ర మళ్ళీ ధనుష్ పై బాంబు పేల్చింది. ఇంతకీ ఆమె వీళ్ళిద్దరి గురించి ఎలాంటి విషయాలను లీక్ చేసింది అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
తాజాగా యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ సుచిత్ర మాట్లాడుతూ ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఒకరినొకరు మోసం చేసుకున్నారని, ధనుష్ కంటే ఐశ్వర్య రజినీకాంత్ దారుణమని, ధనుష్ ని ఆమె ఎక్కువగా మోసం చేసిందని కామెంట్స్ చేసింది. సూర్యన్ ఎఫ్ఎం ఆర్జే గా సుచిత్ర చాలా ఫేమస్. ఆమె కోలీవుడ్ లో ఎన్నో పాటలు పాడి ఒకానొక దశలో నెంబర్ వన్ సింగర్ గా నిలిచింది. యారది నీ మోహిని అనే సినిమాలో ధనుష్ స్నేహితుడిగా నటించిన కార్తీక్ కుమార్ ను సుచిత్ర ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత సుచి లీక్స్ లేపిన ప్రకంపనలు వారి జీవితాలను మలుపు తిప్పాయి.

2017లో ప్లే బ్యాక్ సింగర్ అయిన సుచిత్ర సుచీ లీక్స్ పేరుతో స్టార్ హీరోలు, హీరోయిన్లు సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తుఫాను క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ కి అడిక్ట్ కావడం వల్ల ఇలా చేసిందంటూ విషయాన్ని పక్కదారి పట్టించారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో సుచిత్ర నా భర్త కార్తీక్ ను 12 సంవత్సరాల తర్వాత విడాకులు అడిగాను. అతను గే కాబట్టి అలా చేశాను. కానీ అతనికి ఈ విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం లేదు. అయితే ఇలాంటి వాడితో ధనుష్ విపరీతంగా మద్యం తాగి ఒకే గదిలో ఏం చేశాడు ? అంటూ కోలీవుడ్ ఉలిక్కి పడే ప్రశ్న అడిగింది.
తాజాగా మరోసారి ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ధనుష్ ఐశ్వర్య పెళ్లయ్యాక 17 ఏళ్ల పాటు కలిసే ఉన్నారు. 2022లో డివోర్స్ తీసుకోబోతున్నామని ప్రకటించి షాక్ ఇచ్చారు. అయితే సుచీ లీక్స్ సమయంలో ధనుష్ కి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ ఐశ్వర్య, ధనుష్ తాము విడిపోతున్నాము అన్న విషయాన్ని బయట పెట్టలేదు.

అయితే అంతకంటే ముందే వీరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 3 మూవీ టైంలో ధనుష్, శృతిహాసన్ కలిసి డేటింగ్ కు వెళ్లారని వార్తలు వినిపించాయి. అప్పట్లోనే ఈ ప్రేమ వ్యవహారం కారణంగా ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నారని పుకార్లు వ్యాపించాయి. అయితే అప్పట్లోనే విడిపోయి ఉంటే పెద్ద సమస్య అయ్యేదని, అందుకే అంతా చల్లబడ్డాక ఇప్పుడు విడిపోయారని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ధనుష్ కంటే ఐశ్వర్య రజనీకాంత్ దారుణమని, ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారని సుచిత్ర చెప్పుకొచ్చింది. ధనుష్ డీప్ సీ కంటే ప్రమాదమని, అయితే అతని కంటే ఐశ్వర్య మరింత దారుణమని వెల్లడించింది. అంతేకాదు పెళ్లయ్యాక ఎవరైనా డేట్ కి వెళ్తారా? కానీ ధనుష్ వెళ్ళాడు. ఇలా ఒకరినొకరు బాగానే మోసం చేసుకున్నారు, అలాగే ధనుష్ నా జీవితాన్ని నాశనం చేశాడు అంటూనే ధనుష్ మంచి తండ్రి, కానీ ఐశ్వర్య మాత్రం మంచి తల్లి కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
దీంతో ధనుష్, ఐశ్వర్య ఇన్నాళ్లు పెళ్లి ముసుగులో కేవలం సహజీవనం చేశారా? అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. మరి ముందు ముందు ధనుష్ గురించి ఇంకెలాంటి విషయాలను సూచిత్ర బయట పెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











