షాకింగ్: విలన్‌కు 6 కోట్లు రెమ్యూనరేషన్, శ్రీదేవి కూడా!
హైదరాబాద్: 'ఈగ' చిత్రం ద్వారా విలన్ పాత్రలో నటించిన కన్నడ నటుడు సుదీప్ తెలుగు ప్రేక్షుకులకు సుపరిచితమే. తన నటనతో కట్టిపడేసిన సుదీప్ తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో విలన్ పాత్రకు ఎంపికయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించి సుదీప్ తీసుకునే రెమ్యూనరేషన్ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సుదీప్ ఏకంగా రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సాధారణంగా మధ్య స్థాయి హీరోలు తీసుకునే రెమ్యూనరేషనే 6 కోట్లు ఉండదు. అలాంటిది విలన్ పాత్రకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశం అయింది.
సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

సుదీప్ విలన్ రోల్ ఎంతో కీలకం
సినిమాలో సుదీప్ చేసే విలన్ పాత్ర చాలా కీలకమైనది కాబట్టే దర్శక నిర్మాతలు కూడా ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారట.ఈ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీదేవి కూడా నటిస్తోంది
మరో ఆ సక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో నిన్నటితరం స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషించనుందని తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో నటించిన శ్రీదేవి...ఆ చిత్రం తర్వాత ఒప్పుకునే రెండో చిత్రం ఇదే కావడం గమనార్హం.

దీపిక-శృతి హాసన్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈచిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్, శృతి హాసన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

భారీ చిత్రం
ఇంత భారీ మొత్తం ఖర్చు పెడుతూ, భారీ తారాగణంతో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఏ రేంజిలో ఉండబోతోందో అనే విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











