మరో కోలీవుడ్ స్టార్ హీరోతో మన లేడి డైరెక్టర్ బిగ్ బడ్జెట్ మూవీ

ఆడవాళ్లు కూడా డైరెక్షన్ లో అద్భుతాలు సృష్టించగలరని నేటితరానికి సుధ కొంగర ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. ఆమె తెలుగులో కంటే తమిళ్ హీరోలతోనే వరుసగా సినిమాలను సెట్స్ పైకి తెస్తున్నారు. గురు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న సుధ సూర్యతో ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని విధంగా లాక్ డౌన్ వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక చివరకు అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే ఆ నెక్స్ట్ ఆమె అజిత్ తో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమాతో రానున్నట్లు కోలీవుడ్ లో రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. సింగిల్ సిట్టింగ్ లోనే హీరో అజిత్ సుధ కొంగరా సెట్ చేసుకున్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Sudha kongara another movie with kollywood star hero

ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అనంతరం అజిత్ ఒక స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హెచ్.వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారిగానే ఉన్నాయి. ఆ సినిమా అయిపోగానే అజిత్ మళ్ళీ శివ దర్శకత్వంలోనే ఒక కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను రజినీకాంత్ ప్రాజెక్టును సెట్ చేసుకోవడంతో సుధ కొంగర కథను లైన్ లో పెట్టినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X