సోషల్ మీడియాలో మణిరత్నం వాట్సప్ నంబర్.. ఆ వీడియోలు పంపండి.. సుహాసిని రిక్వెస్ట్
క్షణకాలం కూడా తీరిక లేకుండా గడిపే ఎంతో పెద్ద స్టార్స్‌ను కూడా ఇంట్లో కూర్చోబెట్టేసింది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనాను కట్టడి చేసే భాగంలో మన దేశం సైతం లాక్ డౌన్‌ను విధించింది. గత నెలలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ నేటితో (ఏప్రిల్ 14) పూర్తి కాగా.. మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని కాసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో మే 3 వరకు ప్రజలెవరూ బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

అందరూ ఇంట్లోనే..
స్టార్ సెలెబ్రిటీస్ నుంచి సామాన్య జనం వరకు అందరూ ఇంటికే పరిమితమై ఉన్నారు. సాధారణ ప్రజలు అప్పుడో ఇప్పుడో రోడ్ల మీదకు వస్తున్నారు కానీ.. సెలెబ్రిటీలు మాత్రం ఇంటి గడప కూడా దాటడం లేదు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు.సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఫుల్ జోష్‌లో సుహాసిని..
నాటి హీరోయిన్, మణిరత్నం సతీమణి సుహాసిని ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన భర్త, కొడుకుకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అందులో మణిరత్నంతో మాట్లాడే అవకాశం రావడమే ఇంతటి సెన్సేషన్‌కు కారణం.

సోషల్ మీడియాలో పోస్ట్..
దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి మణిరత్నంను, ఆయన పనిని మీరు చూస్తున్నారు.. ఇప్పుడు మిమ్మల్ని ఆయన చూసే సమయం వచ్చిందని ఓ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ నంబర్‌ను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు అద్బుతమైన అవకాశాన్ని ఇచ్చింది.
Recommended Video

అలా వీడియోలు పంపండి..
మణిరత్నంను అడగాల్సిన ప్రశ్నలు, చెప్పాల్సిన విషయాలను వీడియో ద్వారా వాట్సప్ చేయండని సూచించింది. మీ పేరు, మీ ఊరు చెప్పి ఓ 25 సెకన్ల పాటున్న వీడియోను 9094677777 నంబర్‌కు వాట్సప్ చేయండని సుహాసిని కోరింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ట్రై చేయండి.. మీ ప్రశ్నలకు మణిరత్నం సమాధానాలు ఏంటో చూడండి.


Click it and Unblock the Notifications











