ఒక్కటైన సినీ జంట.. శివాజీ గణేషన్ మనవడితో తెలుగు హీరోయిన్ పెళ్లి!
దక్షిణాదిలో మరో సినీ జంట ఒక్కటైంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన సుజ వరుణి హీరో శివకుమార్‌ను వివాహం చేసుకొన్నది. శివకుమార్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నాడు. వీరి వివాహం సోమవారం (నవంబర్ 19న) చెన్నైలో ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..

రిలేషన్ షిప్‌లో సినీ జంట
వర్ధమాన నటి సుజ వరుణి ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ మనవడు శివకుమార్‌తో గత కొద్ది ఏళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉంది. ఇటీవలే వారి ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం తెలుపడంతో పెళ్లి పీటలకు రావడం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు.

సినీ ప్రముఖుల హాజరు
సుజ వరుణి, శివకుమార్ పెళ్లికి కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్, స్నేహన్, శివకుమార్, గణేష్ వెంకట్రామన్, రాధిక శరత్ కుమార్, శ్రీప్రియ, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిని హృదయపూర్వకంగా దీవెనలు అందించి శుభాకాంక్షలు అందజేశారు.

కెరీర్‌పరంగా సుజ వరుణి
సుజ వరుణి విషయానికి వస్తే తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు పరిచయం. సుమారు 50 చిత్రాల్లో నటించింది. తెలుగులో వెంకటేష్ నటించిన నాగవల్లి, దూసుకెళ్తా, అలీబాబా.. ఒక్కడే దొంగ చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్ తమిళ్‌తో మరింత ప్రాచుర్యం పొందారు.

శివకుమార్ నటించిన చిత్రాలు
ఇక శివాజీ గణేషన్ వారసత్వంతో తమిళ చిత్రంలోకి శివకుమార్ ప్రవేశించారు. సింగుకుట్టి, పుదుముగన్‌గళ్ తేవై, ఇధువుమ్ కదంధు పొగం చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడే గుర్తింపు పొందిన పాత్రల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











