నటి సుకున్యకు సుప్రీకోర్టులో ఊరట
గత ఏడు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్న నటి సుకన్యకు ఎట్టకేలకు సుప్రీ కోర్టులో ఊరట లభించింది. జనవరి 31లోగా ఆమె విడాకుల కేసును పరిష్కరించాలని సుప్రీం చెన్నై ఫ్యామిలీ కోర్టుకు సూచించింది. భర్త నుంచి విడిపోయేందుకు ఆమె ఏడు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తోంది. తెలుగులో పెద్దరికం, భారతీయుడు, మహానది వంటి చిత్రాల్లో నటించిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో యాభైకి పైగా చిత్రాలు చేసింది. ఏడు సార్లు నంది అవార్డులు పొందింది. నటిగా ఓ స్ధాయికి ఎదిగి ఎందరో అభిమానులును సంపాదించుకున్న సుకన్య 2002లో శ్రీధరన్ అనే అమెరికన్ పౌరసత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అయితే కొద్ది రోజులుకే ఆమె భర్త హింసిస్తున్నాడని ఇండియా వచ్చేసింది. సినిమాలలో నటించడం పునఃప్రారంభించింది.
2004లోఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. విడాకుల కేసు విచారణకు సుకన్య భర్త హాజరు కాకపోవడంతో కుటుంబ న్యాయస్థానం ఆమెకు ఎక్స్‌పార్టీ విధానంలో విడాకులు మంజూరు చేసింది. దీనిపై శ్రీధరన్...ఆ తర్వాత కుటుంబన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో ఆ న్యాయస్థానం గతంలో తాను ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. మరోవైపు... అమెరికా పౌరుడినయిన తాను కుటుంబ న్యాయస్థానం పరిధిలోకి రాను అంటూ వాదిస్తూ వచ్చారు. చివరకు సుకన్య, శ్రీధరన్ ల వివాదం సుప్రీంకోర్టుకి చేరింది. దాంతో సుప్రీకోర్టు నాలుగు నెలల్లో ఈ కేసుని పరిష్కరించాలని చెన్నై కోర్టుని ఆదేశించింది. దాంతో సుకన్య కాస్త రిలీఫ్ ఫీలయ్యింది.


Click it and Unblock the Notifications











