సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ,ఆయన కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ చిత్రం 'సుల్తాన్ ది వారియర్' .ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. కాగా ఆ చిత్రం గురించి ఆమె మేం అనుకున్న దానికన్నా అద్బుతంగా వచ్చింది...అందరికి నచ్చి తీరుతుంది అని కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తోంది. ఆమె తొలి చిత్రమైన దీన్ని భారీగా ప్రపంచవ్యాప్తంగా 3,500 ధియోటర్లలలో విడుదలకు ప్లాన్ చేస్తోంది. రజని చిత్రాల లోనే కాక యానిమేషన్ చిత్రాలలోనూ ఇది ఒక సెన్సేషన్ గా రికార్డులు సృష్టించాలని కోరుకుంటోదామె. ప్రముఖ కార్పోరేట్ సంస్ధలతో సంయక్తంగా నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తారట.
Story first published: Saturday, July 18, 2026, 5:25 [IST]