సూపర్ స్టార్ సినిమాకు ఆ గతా?

దర్శకుడు శంకర్ ని,కెమెరా మెన్ రత్నవేలుని తీసుకుని కళానిధి మారన్ ఇంటికి వెళ్ళి ఆయన్ను కలిసారు. ఇప్పటి వరకూ అయిన పదిహేను కోట్లు అయ్యంగారన్ సంస్ధకి చెల్లించి సన్ నెట్ వర్క్ వారు ఆ సినిమాను తీసుకోవటానికి ఒప్పుకున్నారు. రజనీకాంత్ వెళ్ళి అడిగి ఉండకపోతే ఆ ప్రాజెక్టు ఆగిపోయేదని అంతా అన్నారు. అయితే శంకర్ కి కొన్ని ఫైనాన్సియల్ కండీషన్స్ ,లిమిట్స్ పెట్టే ఎగ్రిమెంట్ చేసుకుంటారని తెలుస్తోంది.ఇక ఈ సంగతి తెలుసుకున్న తమిళ మీడీయా వారు షాకయ్యారు.రజనీకాంత్ లాంటి స్టార్ సినిమాకే ఈ పరిస్తితి వస్తే..మిగతా చిన్న చిన్న నిర్మాతల,హీరోల పరిస్ధితి ఏమిటని ఆలోచనలో పడుతున్నారు. మరో ప్రక్క మర్మయోగి చిత్రం ఆగిపోవటం,మణిరత్నం చిత్రం బడ్జెట్ పై కోత వంటివి ఒక్కొక్కటే జరగటం పరిశ్రమలోని వ్యక్తులను విస్తుపోయేలా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











