రజనీకాంత్ ‘రోబో’ వివాదం వెనుక అల్లు అరవింద్ హస్తం...!?
'రోబో" అమ్మకానికి సంబంధించి 27కోట్లకు ఒప్పందం చేసుకుని, 2కోట్లు అడ్వాన్సుగా తీసుకుని..ఆ తర్వాత సన్ పిక్ఛర్స్ వారు ప్లేటు ఫిరాయించడానికి కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. చదలవాడ శ్రీనివాసరావు అనే నిర్మిత 27కోట్లకు 'రోబో" ను కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్న అల్లు అరవింద్..తాను 28 కోట్లు ఇస్తానంటూ ముందుకు రావడం వల్లే..సన్ పిక్చర్స్ వారు మాట తప్పి వ్యవహరిస్తున్నారనేది ఫిలింనగర్ సమాచారం.
ఊరుపేరూ పెద్దగా తెలియని వ్యక్తి 'రోబో" ను తెలుగులో రిలీజ్ చేయడం కంటే అల్లు అరవింద్ వంటి పాపులర్ ప్రొడ్యూసర్, మరియు గొప్ప స్ట్రాటజిస్ట్ తమ చిత్రాన్ని విడుదల చేయడం బాగుంటుందని..తెలుగులో అల్లు అనుసరించే స్ట్రాటజీస్ తో పాటు, పబ్లిసిటీ స్టంట్స్ ను తమిళంలో తాము కూడా అనుసరించి భారీగా లబ్ధి పొందవచ్చని సన్ పిక్చర్స్ భావిస్తున్నందునే ఈ వివాదం తలెత్తిందని తెలుస్తోంది. పైగా, ఎలాగూ కోటి రూపాయలు అదనంగా వస్తున్నాయి కాబట్టి..'రోబో"ను అల్లు చేతిలో పెట్టేందుకు వారు డిసైడైపోయే అవకాశాలున్నాయన్నది కోలీవుడ్ వర్గాల బోగట్టా.


Click it and Unblock the Notifications











