ముదిరిన సునైనా ఎఫైర్ వివాదం.. హీరోతో రెండో పెళ్లికి సిద్ధంగా..

ఎఫైర్స్ తో కొంతమంది తారల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరు ఉహించలేరు. ముఖ్యంగా ఎఫైర్లతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక యంగ్ హీరోయిన్ ప్రేమ వ్యవహారం కూడా తమిళ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదు.. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటించిన 'సునైనా'.

బిజీ యాక్టరే.. కానీ

బిజీ యాక్టరే.. కానీ

సునైనా టీనేజ్ నుంచే సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటోంది. అప్పుడెప్పుడో వచ్చిన 10th క్లాస్ సినిమాలో సంధ్య అనే ఒక రోల్ తో తెలుగు జనాలకు కాస్త దగ్గరైన ఈ భామ తెలుగు సినిమాలకంటే తమిళ్ లొనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆ తరువాత అవకాశాలు బాగానే అందుకుంది గాని పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం శ్రీ విష్ణుతో 'రాజా రాజా చోళ' అనే సినిమా చేస్తోంది.

హీరోతో ఎఫైర్..

హీరోతో ఎఫైర్..

సునైనా చాలా రోజులుగా ఒక తమిళ నటుడితో ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తోంది. మొదట్లో ఈ విషయంపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ సునైనా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఆ నటుడికి ముందే పెళ్లి జరిగింది. ఆ తరువాత విడాకులు కూడా తీసుకున్నాడు. అనంతరం సునైనాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసినట్లు తెలిసింది.

ప్రేమ వ్యవహారంతో గొడవలు..

ప్రేమ వ్యవహారంతో గొడవలు..

సునైనా ప్రేమలో ఉన్నట్లు కొన్ని తమిళ్ మీడియాలో కథనాలు వెలువడడంతో సునైనా తన ఫ్యామిలీ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కూడా ఆ నటుడికి ఇదివరకే ఒకసారి పెళ్లి అయ్యి విడాకులు అవ్వడం వారికి నచ్చలేదు. ఆమె చేసుకోబోయే నటుడి పేరు కృష్ణ కులశేకరన్. అతనెవరో కాదు.. పంజా దర్శకుడైన విష్ణువర్ధన్ సోదరుడు. 2016లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు కృష్ణ సునైనాతో ఎఫైర్ స్టార్ట్ చేశాడు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 91 Highlights
 త్వరలో పెళ్లి..

త్వరలో పెళ్లి..

ఇక ఫైనల్ గా వివాదాలకు ఎండ్ కార్డ్ పెట్టడానికి సునైనా - కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. అసలైతే ఏప్రిల్ లొనే పెళ్లిపీఠలెక్కలని అనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X