‘ కార్‌వాన్‌లో ఉండనంటూ నయనతార గొడవ .. సెట్‌లో అందరిముందే ’

మేల్ డామినేషన్ స్పష్టంగా కనిపించే సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ గాలిలో దీపం లాంటిది. అది ఎప్పుడు ఆరిపోతుందో? ఎప్పుడు వెలుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు హీరోలతో సమానంగా దశాబ్ధాల పాటు తమ కెరీర్‌ను కొనసాగించే వారు హీరోయిన్లు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. హిట్లు పడి , అందం బాగుంటే ఓ ఐదారేళ్లు తమ కెరీర్‌ను కొనసాగించగలుగుతారు. లేదంటే ఎప్పడు వచ్చామో? ఎప్పుడు వెళ్లామో? అన్నట్లుగా పరిస్ధితి ఉంటుంది.

అలాంటి చోట హీరోలకే సవాల్ విసురుతూ , దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. అది కూడా నెంబర్ వన్ హీరోయిన్‌గా. 2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన నయన్ అలియాస్ డయానా మరియమ్ కురియన్.. 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించారు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదొడుకులను, వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ పడిలేచిన కెరటంలా ఎందరికో స్పూర్తిగా నిలిచారు.

sundar c nayanthara clashes mookuthi amman 2 director gave clarity on this Controversy

సౌత్‌లోని అందరూ అగ్రహీరోల సరసన నటించిన నయనతార .. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌‌తో ఆడిపాడే అవకాశం దక్కించుకున్నారు. పాన్ ఇండియా సినిమాల దెబ్బకి వణికిపోతున్న బాలీవుడ్‌కు ఈ సినిమా కొత్త ఊపిరి పోసింది. ఈ తరంలో 75కు పైగా సినిమాలు కంప్లీట్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్‌గా నయనతార నిలిచారు. దూకుడు స్వభావం, లెక్కలేనితనం, ఓవర్ ఆటిట్యూడ్‌ అంటూ నయనతార విషయంలో తరచుగా వినిపించే మాటలు. ఎవరెమనుకన్నా డోంట్ కేర్ అంటూ దూసుకెళ్తున్నారు నయనతార.

శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపి, పెళ్లి వరకు వచ్చి ఆగిపోయినా తిరిగి కోలుకుని నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్నారు. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న నయనతార సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 40 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో యువ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు లేడీ సూపర్‌స్టార్. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను సినిమాలు ఉండగా.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

ఇదిలాఉండగా.. ఆమె తాజా చిత్రం మూకుతి అమ్మన్ 2 షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ సీ, నయనతారకు మధ్య వివాదం తలెత్తిందంటూ కోలీవుడ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇంత జరిగినా సుందర్ కానీ, నయనతార కానీ మౌనంగా ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తాజాగా తను నటించిన గ్యాంగర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సుందర్ సీ ఈ వివాదంపై స్పందించారు. నయనతారతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అసలు అలాంటి పుకార్లు ఎలా ప్రారంభమయ్యయో కూడా తనకు తెలియదన్నారు.

తొలుత తాము పొల్లాచ్చిలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశామని.. కానీ గ్యాంగ్స్ షెడ్యూల్ కారణంగా చెన్నైలోనే చిత్రీకరణ ప్రారంభించామని సుందర్ చెప్పారు. నయన్ అంకిత భావం కలిగిన నటి అని.. షూట్ 30 నిమిషాలు ఆలస్యమైతే కార్‌వాన్‌లో రెస్ట్ తీసుకోమని నేను చెబుతానని, కానీ అధికారికంగా బ్రేక్ లేదా ప్యాకప్ చెబితేనే తాను సెట్‌ను వీడతానని నయన్ పట్టుబట్టేదని సుందర్ తెలిపారు. తనకు , నయనతారకు మధ్య వివాదం నడుస్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సుందర్ సీ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X