శ్రీరెడ్డి సెక్సువల్ ఆరోపణలపై స్పందించిన ఖుష్బూ భర్త

By Bojja Kumar

శ్రీరెడ్డి ఆరోపణలపై తమిళ దర్శకుడు, నటి ఖుష్బూ భర్త సుందర్ సి స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తాను అలాంటి వాడిని కాదని తెలిపారు. సెక్సువల్ ఫేవర్ అడిగినట్లు శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను సుందర్ ఈ సందర్భంగా ఖండించారు.

తనపై వచ్చిన ఆరోపణలను ఊరికే వదిలేయనని, త్వరలోనే శ్రీరెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు, పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు సుందర్ సి వెల్లడించారు. ఇది తన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమని ఆయన తెలిపారు.

అయితే ఈ ఇష్యూపై సుందర్ సి స్పందించిన వెంటనే శ్రీరెడ్డి మరో పోస్టు చేశారు. తాను సుందర్ సి సర్ విషయంలో పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే శ్రీరెడ్డి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతోంది అనేది చర్చనీయాంశం అయింది.

అరణ్మయి మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గణేష్ నుండి ఫోన్ వచ్చింది. అతడు నన్ను సుందర్ సి‌తో పరిచయం చేశాడు. ఆ సమయంలో సుందర్ తన నెక్ట్స్ సినిమాలో లీడ్ రోల్ అవకాశం ఇస్తానన్నాడు. ఆ తర్వాత రోజే మళ్లీ సుందర్ నుండి ఫోన్ వచ్చింది. నన్ను నోవాటెల్‌కు రమ్మని అడిగారు. వెళ్లిన తర్వాత నీకు నా తర్వాతి సినిమాలో 200శాతం ఛాన్స్ ఉంటుందని చెప్పి కాంప్రమైజ్(సెక్సువల్‌గా) కావాలని కోరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో పెరుమాళ్లకే ఎరుక.... అంటూ శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 Sundar C responds to Sri Reddys allegations

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X