twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    300 కోట్ల సినిమా పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది రీమేక్.. పవన్ పాత్రలో ఎవరో తెలుసా!

    |

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ ఘనవిజయం సాధించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ అంశాలు, యువతకు వినోదాన్ని అందించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే అత్తారింటికి దారేది రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే కన్నడలో అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ అయింది. తమిళంలో భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రీమేక్ హక్కులని సొంతం చేసుకోవడం విశేషం.

     300 కోట్ల సినిమా పక్కకు

    300 కోట్ల సినిమా పక్కకు

    ప్రముఖ దర్శకుడు సుందర్ సి అత్తారింటికి దారేది తమిళ రీమేక్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో సుందర్ సి మొదట సంఘమిత్ర అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. సంఘమిత్ర ప్రారంభం అయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో దానిని పక్కకు నెట్టి అత్తారింటికి దారేది చిత్రాన్ని లైన్ లోకి తీసుకుని వచ్చారు.

    లైకా ప్రొడక్షన్స్

    లైకా ప్రొడక్షన్స్

    భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అత్తారింటికి దారేది చిత్ర తమిళ రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ సంస్థే చిత్రాన్ని నిర్మించబోతోంది. కొన్ని రోజుల క్రితం లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    హీరో ఎవరంటే

    హీరో ఎవరంటే

    తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. పవన్ పాత్రకు తమిళంలో సరిపోయే నటుడు ఎవరంటూ అభిమానుల మధ్య చర్చ జరిగింది. దర్శకుడు సుందర్ రొమాంటిక్ హీరో శింబుని హీరోగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    నదియా పాత్రలో

    నదియా పాత్రలో

    అత్తారింటికి దారేది చిత్రం అత్త పాత్ర చుట్టూ తిరుగుతుంది. కథకే ప్రాణం లాంటి ఈ పాత్రలో తెలుగులో నదియా నటించారు. తమిళంలో సుందర్ సతీమణి , సీనియర్ నటి ఖుష్బూ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Sundar C and Simbu to team up for ‘Attarintiki Daredi’. Sundar C directing this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X