twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీ అక్కడికి వచ్చే లోపే చస్తాడు.. అర్హత లేని వారు కూడా అంటూ డైరెక్టర్ సంచలన కామెంట్స్

    |

    రజినీకాంత్ సినిమాల్లో చూపించే దూకుడు రాజకీయాల్లోకి చూపించలేకపోతున్నాడు. వరుసగా ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీలైనన్నీ సినిమాలు చకచకా పట్టాలెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్న రజినీ.. అందుకు అనుగుణంగానే క్షణం తీరిక లేకుండా ఒక దాని వెంట మరొక ప్రాజెక్ట్ మొదలెట్టేస్తున్నాడు. సినీ కెరీర్ ఇలా ఉండే పొలిటికల్ కెరీర్ మాత్రం మరీ డల్‌గా ఉంది. ఇదే విషయంలో ప్రముఖ దర్శకుడు సుందరరాజన్ రజినీపై సంచలన కామెంట్స్ చేశారు.

    ఊరిస్తున్న తలైవా..

    ఊరిస్తున్న తలైవా..

    రాజకీయాల్లోకి రజినీ కాంత్ అన్న అంశం ఎప్పుడూ హాట్ టాపికే. అటు దిశగా ఓ అడుగు ముందు పడితే పది అడుగులు వెనక్కి పడుతున్నాయి. పార్టీ అయితే పెట్టినట్టు ప్రకటించాడు గానీ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో దిగుతాడని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇక ఇదే అంశాన్ని ప్రస్థావిస్తూ సుందరరాజన్ రజినీని విమర్శించాడు.

    జయలలిత జయంతి కార్యక్రమంలో..

    జయలలిత జయంతి కార్యక్రమంలో..

    జయలలిత 72వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సుందరరాజన్ రజినీపై సంచలన కామెంట్స్ చేశాడు. ఈ మేరకు అక్కడ ప్రసంగిస్తూ రాజకీయాల గురించి మాట్లాడాడు. అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదని తెలిపాడు.

    అర్హత లేని వారు కూడా..

    అర్హత లేని వారు కూడా..

    ఎప్పుడైతే ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడో చాలా మంది తమకున్న అర్హతలు ఏమిటో కూడా చూసుకోకుండా సినిమాల్లోకి వచ్చేద్దామని నిర్ణయించేసుకున్నారని పరోక్షంగా కొందరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఎంజీఆర్ ఎన్నడూ తన సినిమాల్లోని విలన్స్‌ను శిక్షించలేదు.. కానీ రజినీ, విజయ్, అజిత్ లాంటి వారి సినిమాల్లో చివరకు విలన్ అంతమైపోతాడని తెలిపాడు. అలాంటి మంచి మనిషి కూర్చున్న సింహాసనం, కిరీటానికి వీరెలా అర్హులంటూ ప్రశ్నించాడు.

    అక్కడి వచ్చే లోపే చస్తాడు..

    అక్కడి వచ్చే లోపే చస్తాడు..

    రజినీకాంత్ పార్టీ పెట్టి కోయింబత్తూరు లో తొలి సమావేశం నిర్వహిస్తే తిర్పూరు చేరుకునే లోపే చచ్చిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆరోగ్యం అంత దారుణంగా ఉందని కామెంట్స్ చేశాడు. దీంతో ఆయనపై తలైవా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

    English summary
    Sundararajan Comments On Rajinikanth That He Will Die Before Reaching Tirupur. Rajinikanth starts a political party and conducts the first meeting in Coimbatore before he reaches Tirupur itself, he will pass away. That is the state of his body condition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X