ఆ కమిడియెన్ కి డబ్బింగ్ చెప్తున్న సునీల్

By Srikanya

కమిడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్ వరస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ సునీల్ తమిళ కమిడియన్ సంతానం కు డబ్బింగ్ చెప్తున్నారు. సంతానం నటించిన ఓకే ఓకే చిత్రం తెలుగులోకి డబ్ చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ డబ్ చేస్తున్న ఈ చిత్రం కోసం సునీల్ తన వాయిస్ ని ఇస్తున్నారు. ఈ చిత్రంలో తాజాగా సంతానం,ఉదయగిరి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో చేసారు. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని తమిళ డైరక్టర్ రాజేష్ డైరక్ట్ చేసారు. దాన్ని ఓకే ఓకే టైటిల్ తో తెలుగులో అందిస్తున్నారు.

ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న మరో చిత్రంలోనూ సునీల్ నటిస్తున్నారు. తమిళంలో హిట్టైన 'వెట్టై'చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు. మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన 'వెట్టై' మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీని ఎన్నుకున్నారు.

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. జూన్ 26నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య ...తమ్ముడుగా కీ క్యారెక్టర్ ని చేస్తూండగా,సునీల్ ..సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు. తమిళంలో ఆర్య..పాత్రను నాగచైతన్య,మాధవన్ పాత్రను సునీల్ చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య చేస్తున్న నాగచైతన్య కు తదుపరి చిత్రం ఇదే. ఇక సునీల్ ఇప్పటికే మాధవన్ నటించిన తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు చేసిన దేవి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.అందులోనూ గతంలో వచ్చిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక వెట్టై చిత్రం యాక్షన్‌, ప్రేమ, సెంటిమెంట్‌ సమాహారంతో రూపొందింది. ఈ చిత్రంలో మాధవన్‌, ఆర్య నటన, సమీరారెడ్డి, అమలాపాల్‌ అందచందాలు, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే యువన్‌ సంగీతం పెద్ద ఎస్సెట్‌ అయింది. ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలోనే హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి షాహిద్‌కపూర్‌ హీరోగా నటించనున్నారు. ఇతర నటీనటుల సంగతి తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X