twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీన్ లోకి సునీల్, తన కెరీర్ కి దెబ్బేసాడని ఆ హీరో గోల

    By Srikanya
    |

    చెన్నై : జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే అంతకు ముందు మరో రెండు ఫ్లాఫ్ లు ఇలా వరస ఫ్లాఫ్ లతో ఉన్న సునీల్ కెరీర్ లో కొత్త మార్పుని కోరుకుంటున్నాడు. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెరీర్ లో మరింత ముందుకు వెళ్లటం కష్టం అని అర్దం చేసుకున్నట్లున్నాడు.

    అందుకే ఇప్పుడు రీమేక్ తో హిట్ కొట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. అది ఓ తమిళ చిత్రం. దాన్ని తెలుగులోకి సైతం డబ్బింగ్ మొదలైపోయింది. కానీ సునీల్ ..నిర్ణయం తీసుకుని రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో డబ్బింగ్ ఆపు చేసేసారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే...

    Sunil to star in That Tamil remake "Enakku Unnoru Peru Irukku"

    సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు తెలుగులో నాకు ఇంకో పేరు ఉంది పేరుతో అనువాదమౌతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఆనంది హీరోయిన్. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఇప్పుడు ఈ సినిమాకు సునీల్ హీరోగా తెలుగు వెర్షన్ కు స్క్రిప్టు రెడీ అవుతోంది. జి నాగేశ్వరరెడ్డి డైరక్ట్ చేయనున్నారు. దాంతో పాపం జి.వి ప్రకాష్ తెలుగులో సెటిల్ అవుదామనుకునే ఆశలు పై నీళ్లు జల్లినట్లు అయ్యింది. కానీ నిర్మాతలే స్వయంగా రీమేక్ రైట్స్ ఇస్తూండటంతో ఏమీ అనలేని డైలమోలో పడ్డాడట.

    1995 లో రజనీకాంత్ బాష సినిమాలో ఒక డైలాగ్ ఉంది 'సార్ నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది' అని అనగానే బాష బాష అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇప్పుడు అదే తరహాలో తెలుగు తమిళ ప్రేక్షకులని తన సంగీతం మరియు నటన తో ఉర్రూతులూగిస్తున్న జి‌వి ప్రకాష్ 'నాకు ఇంకో పేరుంది' అనే టైటిల్ తో మన ముందుకు వద్దామని ప్లాన్ చేసుకుంటే సునీల్ నిర్ణయం తో దెబ్బ పడిపోయింది.

    దాంతో జివి ప్రకాష్ తన శ్రేయాబిలాషులకు ఈ విషయం చెప్పుకుని బాధపడుతున్నాడట. తెలుగులోనూ నాకు ఇంకో పేరు ఉంది అనే టైటిల్ తోనే రానుందని తెలుస్తోంది. తమిళంలో నిర్మాతలే ఇక్కడ కూడా నిర్మించబోతున్నట్లు సమాచారం.

    యాక్షన్ అంశాలు మేళవించిన కుటుంబ కథా చిత్రమిది. తన కుటుంబ ఆశయాన్ని సాధించడానికి ఓ యువకుడు సాగించిన ప్రయత్నాలేమిటి? ఈ క్రమంలో తన గతాన్ని రహస్యంగా ఎందుకు దాచిపెట్టాడు? లక్ష్యసాధనకు అతను ఎలాంటి ఎత్తులు వేశాడు? అనే అంశాల సమాహారంగా సాగే చిత్రమిది. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఉత్కంఠను కలిగిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణవసంత్, సంగీతం: జీవీ ప్రకాష్, కథ, దర్శకత్వం: శ్యామ్ ఆంటోన్.

    English summary
    Apparently the makers of GV Prakash's "Enakku Unnoru Peru Irukku" don't want to dub the film here, but they want to remake it with Sunil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X