‘టెంపర్’ రీమేక్‌లో సన్నీ లియోన్ ఐటం సాంగ్!
సన్నీ లియోన్ త్వరలో 'వీర మహాదేవి' అనే సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. విశాల్ హీరోగా రూపొందుతున్న 'అయోగ్య'లో కనిపించబోతోందట.
తమిళ మీడియా కథనాల ప్రకారం... 'అయోగ్య'లో సన్నీ లియోన్ మేజర్ రోల్ ఏమీ చేయడం లేదని, ఇందులో ఆమె స్పెషల్ ఐటం సాంగులో కనిపించబోతోందని తెలుస్తోంది. ఇది తెలుగు సూపర్ హిట్ మూవీకి 'టెంపర్'కు రీమేక్. గతంలో సన్నీ లియోన్ తెలుగులో 'పిఎస్‌వి గరుడ'తో పాటు ఓ కన్నడ చిత్రంలోనూ ప్రత్యేక గీతాల్లో నటించింది.

తెలుగు వెర్షన్లో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే ఐటం సాంగులో నోరా ఫతేహి నటించింది. తమిళ వెర్షన్లో సన్నీ లియోన్‌తో దీన్ని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ వద్ద పని చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
విశాల్‌కు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. ఆర్ పార్తిబన్, కెఎస్ రవికుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో కలిసి లైట్ హౌస్ బేనర్లో బి మధు నిర్మిస్తున్నారు. మరో వైపు 'టెంపర్' మూవీ హిందీలో 'సింహా' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణవీర్ సింగ్, సారా జంటగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











