వీరనారిగా సన్నీలియోన్.. ఇక తెరపై విలయతాండవం
సెక్స్‌బాంబ్ సన్నీలియోన్ ఇక వీరనారిగా తెరపై విలయతాండవం చేయనున్నది. సన్నీ తమిళ చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్నది సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గురువారం (ఫిబ్రవరిన) ప్రారంభమైంది. ఆ విషయాన్ని సన్నీలియోన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

వీరమదేవిలో సన్నీలియోన్
వీరమదేవి సినిమా ప్రారంభమైంది. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అని సన్నీలియోన్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో యుద్దనారీగా సన్నీలియోన్ కనిపించనున్నది. ఈ చిత్రానికి దర్శకుడు వీసీ వాదిఉదయన్.
Recommended Video


స్టీవ్స్ కార్నర్ బ్యానర్‌పై
స్టీవ్స్ కార్నర్ అనే బ్యానర్‌పై వీరమదేవి సినిమాను పోన్స్ స్టీఫెన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

విలన్ పాత్రలో నవదీప్
యువ హీరో నవదీప్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజులపాటు కాల్షిట్స్‌ను కేటాయించినట్టు తెలిసింది. చారిత్రాత్మక నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నది. సన్నీ లియోన్ యాక్షన్ సీన్లలో కూడా కనువిందు చేయనున్నారు.

మానసికంగా సిద్ధమయ్యా
చాలా రోజులుగా ఇలాంటి స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాను. వీసీ వడిఉదయన్ కథ చెప్పగానే పాత్ర కోసం మానసికంగా సిద్ధమయ్యాను. దక్షిణాది సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి రూపొందే సినిమాల్లో నటించాలంటే చాలా ఆసక్తిగా ఉంటుంది అని సన్నీలియోన్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











