రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!

సూపర్ స్టార్ రజనీకాంత్ చివరగా దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏఆర్.మురగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే హిట్టవ్వలేదు. దీంతో నెక్స్ట్ సినిమాపైనే అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. నెక్స్ట్ శివ దర్శకత్వంలో అన్నత్తే అనే సినిమాతో రానున్న విషయం తెలిసిందే. నిజానికి రజనీకాంత్ గత కొన్నేళ్లుగా సరైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవడం లేదు.

కానీ ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆయన మార్కెట్ మీద మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడలేదని ప్రతి సినిమాకు వస్తున్న ఓపెనింగ్స్ తోనే అర్ధమవుతోంది. ఇక ఇటీవల తలైవా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. డైరెక్టర్ శివతో అన్నత్తే అనే ఒక సినిమాను చేయడానికి సిద్ధమవ్వగా కోవిడ్ వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక ఆరోగ్య సమస్యల వల్ల రాజకీయాలకు కూడా దూరమైన రజనీకాంత్ సినిమాలను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి.

Supar star Rajanikanth annaatthe movie release date fix

కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు శివ ఇప్పటికే రజనీకాంత్ కు సంబంధం లేని సన్నివేశాలను షూట్ చేశాడు. ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాత షూటింగ్స్ తో బిజీ కావాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాను 2021 నవంబర్ 4న రిలీజ్ చేయాలని ప్లాన్ సెట్ చేసుకున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. మరి రజనీకాంత్ అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడో లేదో చూడాలి.

దర్శకుడు శివ రజనీకాంత్ అన్నత్తే సినిమాను పక్కనపెట్టి మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చినట్లు టాక్ వస్తోంది. సూర్యతో కూడా శివ ఒక సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రజినీకాంత్ ఇప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో శివ డ్రాప్ అయినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X