Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ నిర్మాత మనకు దేవుడిచ్చిన వరం.. ఆయన వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది.. రజనీకాంత్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సూర్యను రజనీకాంత్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక బందోబస్త్ (కాప్పాన్) సినిమా గురించి చెప్పాలంటే సుభాస్కరన్ గురించి చెప్పాలంటే... ఆయన మనకు దేవుడిచ్చిన వరం. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సగం మంది ఆయన సినిమాల్లోనే పనిచేస్తున్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 'ఇండియన్ 2' సినిమాను చేస్తున్నారు. అది తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అలాగే 60 ఏళ్లుగా ఎంజిఆర్గారి నుంచి ఇప్పటి వరకు ఎందరో చేయాలనుకుంటున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమాను మణిరత్నం దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అలాగే నేను, మురుగదాస్‌గారు కలిసి చేస్తోన్న 'దర్బార్' సినిమాను నిర్మిస్తున్నారు అని రజనీకాంత్ తెలిపారు.
ఇక సీనియర్ రైటర్ వైరముత్తు మాట్లాడుతూ - ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌గారికి, నేషనల్ యాక్టర్ మోహన్‌లాల్ గారికి ముందుగా కృతజ్ఞతలు. ఇలాంటి భారీ చిత్రం రావడానికి ప్రధాన కారణమైన వ్యక్తుల్లో ముఖ్యుడు నిర్మాత సుభాస్కరన్. ఆయన చొరవతోనే ఈ సినిమా రూపొందింది.