సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది
సినిమా ఫలితాల సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తూ.. ఆరుపదుల వయసులోనూ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. కబాలి, కాలా, పేట్టా, రోబో2 ఇలా వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నా రజినీ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో దర్బార్ చిత్రం చేస్తున్నాడు.

దర్బార్ నుంచి అప్‌డేట్..
సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త ఒకటి వచ్చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్‌తో ప్రస్తుతం చేస్తున్న దర్బార్ మూవీకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చేసింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు.. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

అప్‌డేట్‌ను ప్రకటించిన అనిరుద్..
సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రకటిస్తారని ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశాడు. నేడు అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా దర్బార్ నుంచి ఓ అప్‌డేట్‌ను ప్రకటించారు. అసలే ఇప్పటికే లీకైన వర్కింగ్ స్టిల్స్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

దర్బార్ మోషన్ పోస్టర్..
ఈ మేరకు అనిరుధ్ ట్వీట్ చేస్తూ.. ‘నేటి ఈ ప్రత్యేక రోజున మీ అందరికీ ఓ అప్‌డేట్ ఇస్తున్నందుకు చాలా ఆనందగా ఉంది.. నవంబర్ 7న దర్బార్ మోషన్ పోస్టర్‌తో పాటు థీమ్ మ్యూజిక్‌ను రిలీజ్ చేస్తాను.. తలైవార్ రజినీ, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ ఈ సంక్రాంతిని బ్లాస్ట్ చేయడానికి వచ్చేస్తోంద'ని తెలిపాడు.
హ్యాట్రిక్ డైరెక్టర్ శివతో..
రీసెంట్‌గా రజినీ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించేశాడు. వీరం, వేదాలం, విశ్వాసం లాంటి చిత్రాలతో హిట్లు కొట్టిన దర్శకుడు శివ.. రజినీని డైరెక్ట్ చేయనున్నాడు. రోబో, పేట్టా లాంటి చిత్రాలను నిర్మించిన సన్ నెట్వర్క్ ఈ మూవీని నిర్మించనుంది.


Click it and Unblock the Notifications











