దర్బార్ ముగించి.. బరిలోకి దూకిన రజనీకాంత్

కబాలి, కాలా, పేట్ట చిత్రాలతో జోరు పెంచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ సంక్రాంతిని అభిమానులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ బరిలో నిలిచేందుకు ముస్తాబుతున్నది. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

దర్బార్ సినిమాలోని ప్రధాన భాగమంతా ముంబైలోని మురికివాడల్లో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో నిర్విరామంగా జరిగిన షూటింగ్‌లో నయనతార, రజనీకాంత్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి లైకా ప్రొడక్షన్ ఓ ట్వీట్ చేసింది.

Super star Rajinikanth finishes shoot of Darbar movie

దర్బార్‌లో తలైవర్ తన షూటింగ్‌ పార్ట్‌ను ముగించుకొన్నాడు. ఇక సంక్రాంతికి బరిలో దూకడమే ముందుంది. పొంగల్ కోసం రావడానికి తలైవర్ రెడీ అవుతున్నాడు అంటూ లైకా ప్రొడక్షన్ ట్వీట్ చేసింది. మురగదాస్, రజనీకాంత్‌తో కూడిన ఫోటొను షేర్ చేసింది.

ఇక తన కెరీర్‌లో 167వ చిత్రంగా తెరకెక్కుతున్న దర్బార్ చిత్రంలో రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపించనున్నారు. ఒకటి పోలీస్ అధికారి పాత్రకాగా, రెండో టీచర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. 1992లో పాండ్యన్ సినిమా తర్వాత రజనీకాంత్ ఈ పోలీసు డ్రెస్‌లో కనిపించడం ఇదే తొలిసారి.

దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటిస్తన్నారు.

ఏప్రిల్ విడుదలైన దర్బార్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పోలీసు డ్రెస్సులో రజనీకాంత్ గెటప్ అదిరిపోయేలా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ఫస్ట్‌లుక్‌లో వదలిన పంచ్‌లైన్ కేక పెట్టించింది. మంచిగా ఉండాలా.. చెడుగా.. అంతకంటే చెత్తగా ఉండాలా అనేది నువ్వే డిసైడ్ చేసుకో అనే పంచ్‌లైన్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X