For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌తో సూపర్ స్టార్ సమావేశం: దాని గురించి ఆందోళన పోగొట్టేందుకే ఇలా

    |

    పేరుకు దక్షిణాదికి చెందిన హీరోనే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ఆయన.. తన విలక్షణ నటన, విభిన్నమైన స్టైల్స్‌తో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఆరు పదుల వయసులోనూ హవాను చూపిస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ సీనియర్ హీరో ఆరోగ్యం అంతగా బాగోవడం లేదు. ఇటీవలే ఆయన అమెరికా కూడా వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రజినీకాంత్ ఫ్యాన్స్‌తో సమావేశం కాబోతున్నారన్న న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం క్షిణించిందని.. ఏదో సమస్యతో బాధ పడుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ స్టార్ హీరో ఫ్యాన్స్ అంతా భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 12న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్స్‌తో సమావేశం ఏర్పాటు చేశారు రజినీకాంత్. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాల నాయకులను ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో తన ఆరోగ్యం గురించిన పూర్తి సమాచారాన్ని వాళ్లతో పంచుకోబోతున్నారని ఓ న్యూస్ లీకైంది. తద్వారా తన ఆరోగ్యం పట్ల వాళ్ల ఆందోళనలను పోగొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

     Super Star Rajinikanth Invite Fans for Meeting

    ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివతో కలిసి 'అన్నత్తే' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న దీన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    English summary
    Super Star Rajinikanth Has Huge Fan Base In The World. Now He Invited His Fans for Meeting on July 12th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X