రజనీ.. వాట్ ఏ సింప్లిసిటి.. సూపర్‌స్టార్ పక్కనున్నది ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల ప్రవర్తన కొన్నిసార్లు చాలా వివాదాస్పదంగా ఉంటాయి. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ వాటన్నిటికి భిన్నంగా ఉంటారు. కోట్లాది రెమ్యునరేషన్ తీసుకొన్నా.. లక్షల్లో అభిమానులు ఉన్నప్పటికీ.. ఆయన సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారనే విషయం పలుమార్లు రుజువైంది. ఆయన ముఖంలో స్టార్ హీరో అనే అహం కనిపించదు. సాధారణ పౌరుడిలా సమాజంలో కనిపిస్తారు.

రజనీకాంత్ సింప్లిసిటీ
తాజాగా రజనీకాంత్ సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచే ఓ ఫోటో మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కరోనావైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన సూపర్‌స్టార్ తన ఇంటి సభ్యులతోనే కాకుండా ఇంట్లో పనిచేసే వారిని కూడా కుటుంబ సభ్యులుగానే చూడటం రజనీ వ్యక్తిత్వం మరోసారి చర్చనీయాంశమైంది.

ఆరోగ్యం ఎలా ఉందని..
కరోనావైరస్ సమయంలో పనివాళ్లను ఇంట్లోకి కూడా అడుగుపెట్టనివ్వని యజమానులు ఉన్న ఈ పరిస్థితుల్లో తన పనిమనిషిని ఇంట్లో సభ్యురాలిగా భావిస్తూ ఆమెకు ప్రేమను పంచుతూ హత్తుకొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే తన ఆరోగ్యం, ఆర్థిక వివరాలను అడిగి తెలుసుకొన్నారనే విషయం సోషల్ మీడియాలో వెల్లడైంది.

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నారు. ప్రతీ ఒక్కరిని ఇంటికే పరిమితం కావాలని సలహా ఇస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Recommended Video

అన్నాతే, చంద్రముఖి2లో రజనీ
ప్రస్తుతం రజనీకాంత్ అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. సిరుతాయ్ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కుష్బూతోపాటు కీర్తి సురేష్, మీనా, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ రజనీకాంత్ కూతురిగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, చంద్రముఖి2 సినిమాకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి లారెన్స్ రాఘవ దర్శకత్వం వహిస్తారనే విషయం మీడియాలో ప్రాధాన్యం సంతరించుకొన్నది.


Click it and Unblock the Notifications











