కరోనా ఎఫెక్ట్.. రజినీకాంత్ కూడా కమల్ హసన్ బాటలోనే..
కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఒక్కసారిగా ప్రాణ భయంతో వణికిపోతోంది. కంటికి కనిపించని వైరస్ ఒక్కసారిగా మానవాళిని చిన్నా భిన్నంగా మార్చేసింది. కొన్ని దేశాల్లో మనుషులు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇండియాలో కూడా రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల వరకు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే. అయితే సినీ తారలు చాలా వరకు వారి స్థానిక ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల కమల్ హసన్ చెన్నైలోని తన ఆఫీస్ ని రోగుల కోసం వాడుకునేందుకు ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ చిక్కిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని ఇచ్చారు.

ఇక అదే బాటలో రజినీకాంత్ కూడా తనకున్న కళ్యాణ మండపాన్ని కూడా కొన్నిరోజుల పాటు జనాల కోసం ఉపయోగించాలని వైద్య సిబ్బందికి అందించారు. రజినీకాంత్ ఇప్పటికే తమిళ సినీ వర్కర్స్ కోసం 50లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడు తన రాఘవేంద్ర కళ్యాణ్ మండపాన్ని కూడా కరోనా ఐసోలేషన్ వార్డుల కోసం అప్పగించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











