జయలలితను వ్యతిరేకిస్తే.. నీలాంబరి కోసం థియేటర్లు అలా ధ్వంసం.. రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పడయప్ప. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మిగిలిపోయింది. ఈ చిత్రంలో సౌందర్య, అబ్బాస్, సితార, నాజర్, రాధా రవి తదితరులు నటించారు. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ కీలక పాత్రలో నటించారు.

ఈ చిత్రానికి మ్యాజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా, ఎస్ మూర్తి, ప్రసాద్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. కే తనిగాచలం ఎడిటింగ్ బాధ్యతలను పర్యవేక్షించారు. అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను కే సత్యనారాయణ, ఎంవీ కృష్ణారావు, కే విట్టల్ ప్రసాద్ రావు, పీఎల్ తేనప్పన్ నిర్మించారు. 1999 సంవత్సరంలో ఈ చిత్రం రిలీజై తమిళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 210 ప్రింట్లతో రిలీజైంది.ఈ సినిమా క్యాసెట్లు సుమారుగా 7 లక్షలు మేర అమ్ముడుపోవడం ఓ రికార్డుగా చెప్పుకొంటారు.

Rajinikanth Padayappa 2

అయితే పడయప్ప (నరసింహ)ను చూసి ప్రేమలో పడ్డ గొప్పింటి అమ్మాయి నీలాంబరి (రమ్యకృష్ణ)ని కాదని పేదింటి అమ్మాయి వసుంధర (సౌందర్య)ను పెళ్లి చేసుకొంటాడు. దాంతో ద్వేషం పెంచుకొన్న నీలాంబరి.. పడయప్పపై పగ తీర్చుకోవాలనుకొంటుంది. నీలాంబరి చేసిన అనేక కుట్రలు, కుత్రంతాలను పడయప్పా ఎలా తిప్పి కొట్టాడనేది ఈ సినిమా కథ. నీలాంబరి పాత్ర ఇప్పటికే ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మారిపోయింది. రమ్యకృష్ణ ఇమేజ్‌ను ఊహించని విధంగా మార్చేసింది. అలాంటి గొప్ప సినిమాకు సీక్వెల్ సిద్దం కాబోతున్నదని సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా క్రేజీగా అప్‌డేట్ ఇచ్చారు.

నీలాంబరి టైటిల్‌తో పడయప్పా2 సినిమా ప్లానింగ్ జరుగుతున్నది. స్టోరీ డిస్కషన్స్ వేగంగా జరుగుతున్నాయి. పడయప్పా సినిమా రిలీజైనప్పుడు మహిళ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. థియేటర్ గేట్లు ధ్వంసం చేసుకొని విరగబడి ఈ సినిమాను లేడీస్ చూశారు. సినిమా రంగంలో నీలాంబరి పాత్ర మహిళలకు మైలురాయిగా నిలిచింది. ఇప్పటికి ఏ ఓటీటీకి ఈ సినిమాను ఇవ్వలేదు అని రజనీకాంత్ అన్నారు.

1996 సంవత్సరంలో అప్పటి అన్నాడీఎంకే నేత, ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన విధానాలను నేను వ్యతిరేకించాను. 1997 సంవత్సరంలో పడయప్పా సినిమా ప్రారంభించినప్పుడు అందులోని నీలాంబరి క్యారెక్టర్‌ను తనను ఉద్దేశించి రాశారని ఆమె ఆగ్రహం చెందారు. ఆ సమయంలో అలాంటి రూమర్లు బాగానే వ్యాపించాయి. కానీ సినిమా చూసిన తర్వాత జయలలిత అభినందించడంతోపాటు ప్రశంసలు గుప్పించారు అని రజనీకాంత్ తాజాగా చెప్పారు.

రజనీకాంత్ ఇటీవల తన నట జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు. సినిమా రంగంలో 10, 15 ఏళ్ల జీవితం ఉంటుంది. కానీ నాకు అంతకంటే ఎక్కువగానే ప్రేక్షకులు ఇచ్చారు. మరో 100 జన్మలు ఎత్తినా నటుడిగానే పుట్టాలని కోరుకొంటున్నాను అని ఇటీవల ఎమోషనల్‌గా తన భావాలను పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X