కరోనా స్పీడ్ చూసి చేతులెత్తేసిన తలైవా.. వైరస్ తగ్గిన తరువాతే షూటింగ్స్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు పెరుగుతున్న కొద్దీ స్పీడ్ పెంచుతున్నారని మొన్నటివరకు ఒక రేంజ్ లో వార్తలు వచ్చాయి. నిజానికి కబాలి సినిమా తరువాత తలైవా కాస్త స్పీడ్ పెంచడానే చెప్పాలి. అయితే రోబో తరువాత ఇంతవరకు సూపర్ స్టార్ అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా వరుస డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి.
అయినప్పటికీ తలైవా యువ దర్శకులను లైన్ లో పెడుతూనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న రజినీకాంత్ కు అనుకోని విదంగా లాక్ డౌన్ దెబ్బ పడింది. జూలైలోపు కరోనా వైరస్ పూర్తిగా తగ్గుతుందని అనుకున్నారు. కానీ తమిళనాడులో ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇండియాలో ముంబై తరువాత అత్యదిక కేసులు తమిళనాడులోనే పెరుగుతున్నాయి.

ఈ దెబ్బతో షూటింగ్ కి రాలేనని తలైవా చేతులెత్తేశాడని తెలుస్తోంది. ఇప్పట్లో తను ఎంత మాత్రం రిస్క్ చేయలేనని వైరస్ అదుపులోకి వచ్చిన తరువాతే షూటింగ్స్ లోకి వస్తానని అన్నాడట. అయితే నిర్మాత మాత్రం ముందు షూటింగ్స్ స్టార్ట్ చేయాలని డైరెక్టర్ శివకు చెప్పినట్లు తెలుస్తోంది.
ముందు రజినీకాంత్ తో అవసరం లేని సీన్లను పూర్తి చేసి చివరికి ఆయన షెడ్యూల్స్ ని సెట్ చేసుకుందామని ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి తలైవా ఆ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











