నీవో వీధి కుక్కవు.. పబ్లిసిటీ కోసం మొరగొద్దు.. మీరా మిథున్‌పై విజయ్, మహేష్‌ ఫ్యాన్స్ ఫైర్

తమిళ చిత్ర పరిశ్రమలో మోడల్‌గా, వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన మీరా మిథున్ ఇటీవల కాలంలో సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారుతున్నది. ఇటీవల విజయ్ లాంటి హీరోలను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన విజయ్‌పై మీరా మిథున్ దారుణంగా కామెంట్లు చేసింది. ఈ వివాదంపై తనను లాగడంపై కమెడియన్ వివేక్ ఘాటుగా స్పందించారు. ఇంతకు మీరా మిథున్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు భారీ స్పందన

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు భారీ స్పందన

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ తమిళనాడుకు పాకింది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన కనిపిస్తున్నది. తాజాగా తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహేష్ బాబు మొక్కలు నాటారు. విజయ్‌ని కూడా మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

మహేష్ బాబు ఛాలెంజ్‌ను స్వీకరించిన విజయ్

మహేష్ బాబు ఛాలెంజ్‌ను స్వీకరించిన విజయ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్‌కు స్పందించిన తమిళ సూపర్ స్టార్ విజయ్ తన విల్లాలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణానికి మేలు చేసే అద్భుతమైన కార్యక్రమం, ఇతర దేశాలతో పోల్చితే దేశంలో సరైన మోతాదులో మానవులకు ఆక్సిజన్ అందడం లేదు. అందుకు కారణం జనాభాకు సరిపడే చెట్లు లేకపోవడమే. ఇలాంటి సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమం సాగుతున్నది. పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగాహనా కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

విజయ్‌పై మరోసారి నోరుపారేసుకొన్న మీరా మిథున్

విజయ్‌పై మరోసారి నోరుపారేసుకొన్న మీరా మిథున్

గత కొద్దికాలంగా సూర్య, విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మీరా మిథున్ సోషల్ మీడియాలో స్పందించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో విజయ్ పాల్గొనడంపై మీరా మిథున్ నోరుపారేసుకొన్నది. నీ విల్లాలో మొక్కలు నాటితే సమాజానికి ఎలా మేలు జరుగుతుంది. ఎలా? ఎందుకు మొక్కలు నాటాలో అనే విషయాన్ని యాక్టర్, కమెడియన్ వివేక్ నుంచి నేర్చుకోండి అంటూ మీరా మిథున్ ట్వీట్ చేశారు.

 కమెడియన్ వివేక్ రియాక్షన్

కమెడియన్ వివేక్ రియాక్షన్

విజయ్ మొక్కలు నాటిన విషయంలోకి తనను లాగుతూ మీరా మిథున్ ట్వీట్‌పై వివేక్ స్పందిస్తూ.. నీ పోస్టు ఎన్నో లక్షల మంది విజయ్ ఫ్యాన్స్ మనోభావాలను గాయపరిచింది. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పండి. ఇద్దరు వ్యక్తులను పోల్చిచూడకండి. ఇది నా రిక్వెస్ట్ అంటూ కమెడియన్ వివేక్ ట్వీట్ చేశారు.

విజయ్, మహేష్‌కు లక్షలాది ఫ్యాన్స్

విజయ్, మహేష్‌కు లక్షలాది ఫ్యాన్స్

విజయ్, మహేష్ బాబు సార్‌ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ ఇద్దరు పర్యావరణం కోసం ఏదైనా చేస్తే వారికి ఉన్న లక్షలాది మంది స్పూర్తి పొంది మంచి పనులు చేస్తారు. ఇలాంటి పనులను మనం స్వాగతించాలి. ఇలా ఒకరిని మరొకరితో కంపారిజన్ చేయొద్దు. చివరగా ఈ భూమి పచ్చదనంతో కళకళలాడాలన్నదే అందరి లక్ష్యం అని కమెడియన్ వివేక్ అన్నారు.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
 మీరా మిథున్‌పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం

మీరా మిథున్‌పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం

విజయ్, మహేష్ బాబులను ఉద్దేశించి మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. మీరాను దుర్బాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి విజయ్ మొక్కలు నాటారు. సెలబ్రిటీ కాబట్టి ఆయన విల్లాలోనే మొక్కలు నాటుతారు. రోడ్లపై చెత్త పనులు చేయడానికి నీ లాగా వీధి కుక్క కాదు అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం ఇతరులపై బురద చల్లే వేషాలు మానుకో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X