twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ సూపర్‌స్టార్ విజయ్.. ఎస్పీ బాలు కోసం కరోనాను లెక్క చేయకుండా.. చరణ్‌కు పరామర్శ

    |

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు విషాదంలో మునిగిపోయారు. భాషలు, ప్రాంతాలకతీతంగా బాలు సేవలను గుర్తు చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం కరోనా అన్ని ప్రాంతాల్లో విజృంభిస్తున్న సమయంలో ఎస్పీ బాలు అంత్యక్రియలకు సినీ ప్రముఖులు దూరంగా ఉన్నారు. కానీ చెన్నైకి సమీపంలో జరిగిన అంత్యక్రియల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ ఒక్కరే హాజరుకావడం గమనార్హం. అంత్యక్రియల్లో విజయ్ పాల్గొన్న సందర్భంగా..

    కరోనా పరిస్థితుల్లో అంత్యక్రియలకు దూరంగా

    కరోనా పరిస్థితుల్లో అంత్యక్రియలకు దూరంగా

    ఎస్పీ బాలు మరణాన్ని జీర్ణించుకోలేని సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా వర్గాలు తమ ఆవేదన, బాధను వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కరోనా సమయంలో ఆంక్షలు ఉండటంతో బాలు అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్నలేకపోయారు. తమకు తోచిన విధంగా వీడియోల రూపంలో, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

    అంత్యక్రియలకు సూపర్‌స్టార్ విజయ్

    అంత్యక్రియలకు సూపర్‌స్టార్ విజయ్

    చెన్నైకి సమీపంలోని తమరైపాకం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరుగుతుండగా తమిళ సూపర్‌స్టార్ విజయ్ అక్కడికి చేరుకొన్నారు. పుట్టెడు విషాదంలో ఉన్న ఎస్పీ చరణ్‌ను స్వయంగా ఓదార్చారు. ఎస్పీ చరణ్‌కు మనోధైర్యం చెబుతూ బాధను పంచుకొన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి విషాద వదనంతో నిష్క్రమించారు.

    సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

    సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

    ఎస్పీచరణ్‌తో విజయ్ మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ హాజరుకావడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కరోనా సమయంలో కూడా ధైర్యంగా అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్న ఎస్పీ చరణ్‌ను ఓదార్చడం అభినందనీయం అంటున్నారు.

    పాడుతా తీయగా బృందం కన్నీటి పర్యంతం

    పాడుతా తీయగా బృందం కన్నీటి పర్యంతం

    ఇదిలా ఉండగా, అంత్యక్రియల అనంతరం ఎస్పీ బాలుతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న పాడుతా తీయగా సభ్యుల్లో కొందరు మీడియాతో తమ ఆవేదనను పంచుకొన్నారు. గత 20 ఏళ్లుగా ఎస్పీ బాలు బృందంలోని రవి కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. కోట్లాది మంది తరలి వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇలా బాలు మన నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

    Recommended Video

    #SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
    ప్రభుత్వ లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు

    ప్రభుత్వ లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు

    ఆగస్టు 5వ తేదీన కరోనావైరస్ పాజిటివ్‌తో చెన్నైలోని ఎంజీఎంలో హాస్పిటల్‌లో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోలుకొన్నట్టే కనిపించిన ఆయనకు గత రెండు రోజుల క్రితం ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో మరణించారు. ఎస్పీ బాలుకు తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.

    English summary
    Legendary singer SP Balasubrahmanyam (SPB) dies at the age of 74 who got infected due to coronavirus on August 5, 2020. Apart from this On August 5th SP Charan shared a video about sp balasubrahmanyam health condition. He died in Chennai's MGM Hospital. SP Balasubrahmanyam's last rites completed with Tamilnadu Government, Police Honors. Super stat vijay attended for SP Balu funerals.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X