స్టార్ హీరో భార్య‌కు తీవ్ర అనారోగ్యం.. అజర్‌బైజాన్ నుంచి షూటింగ్ మధ్యలోనే..!

By Lekhaka

స్టార్ హీరోలు ఇంట్లో కంటే ఎక్కువగా సెట్స్ లోనే గడుపుతారు. ఇంకొన్ని సార్లు ఎక్కడో విదేశాల్లో నెలల తరబడి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి టైమ్ లో తమ కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ స్టార్ హీరో భార్యకు సడన్ గా ఆపరేషన్ జరిగినట్టు సమాచారం. అయితే ఓ సినిమా కోసం విదేశాలకు వెళ్ళిన హీరో విషయం తెలుసుకుని మధ్యలోనే ఇండియాకు తిరిగి వచ్చేశారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన భార్యకు ఏమైంది ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో కాదు పాపులర్ సౌత్ సెలబ్రిటీ కపుల్ అజిత్, షాలిని గురించే. ప్రముఖ నటి, అజిత్ భార్య షాలిని హఠాత్తుగా ఆపరేషన్ చేయించుకుందన్న వార్త అభిమానులను షాక్ కు గురి చేసింది. తమిళ చిత్రసీమలో సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు అందరూ అసూయపడే స్టార్ కపుల్ అజిత్-షాలిని .

Superstar Ajith Kumar returns from azerbaijan to India for due to Shalini health condition worsen

బాలతారగా పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన షాలిని.. అజిత్ తో 'అమర్కలం' సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే అజిత్ షాలినితో ప్రేమలో పడ్డాడు. మొదట్లో అతని ప్రేమను అంగీకరించడానికి ఇష్టపడని షాలిని తర్వాత అంగీకరించింది. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత తల్లిదండ్రుల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

వారి ప్రేమకు చిహ్నంగా అజిత్-షాలినీ దంపతులకు అనోష్క అనే కుమార్తె, అద్విక్ అనే కుమారుడు ఉన్నారు. అజిత్ మొదట్లో కెమెరా కంటికి కన్పించకుండా తన పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే గత రెండేళ్లుగా అనుష్క, ఆద్విక్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అదే విధంగా అజిత్ భార్య షాలిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాకు కూడా అందుబాటులో లేకుండా పోయింది.

అయితే రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినప్పటి నుండి , ఆమె తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. మరోవైపు అజిత్ మాత్రం ఓ వైపు వరుస సినిమాలతో, వరల్డ్ టూర్ అంటూ బైక్ పై దేశంఅంతా చక్కర్లు కొడుతున్నాడు. రీసెంట్ గా ఈ హీరో విడామయూర్చి మూవీ షూటింగ్ కోసం అజర్ బైజాన్ వెళ్లారు.

Superstar Ajith Kumar returns from azerbaijan to India for due to Shalini health condition worsen

ఈ క్రమంలో అజిత్ భార్య షాలిని ఆరోగ్యం బాగోలేక వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ చేయించుకుందన్న వార్త సంచలనం రేపుతోంది. అయితే షాలినికి అసలు ఏమైంది? సడన్ గా ఆపరేషన్ ఎందుకు చేశారన్న సమాచారం బయటకు రాలేదు. అయితే ఈ విషయం తెలిసిన అజిత్ కూడా షూటింగ్ వల్ల షాలిని ఆపరేషన్ టైమ్ కు పక్కన లేడట.

సమాచారం ప్రకారం అజర్‌బైజాన్‌కు వెళ్లే ముందు అజిత్ తన భార్య ఆపరేషన్‌కు అవసరమైన అన్ని సన్నాహాలు చేసాడని తెలుస్తోంది. అలాగే షాలినికి ఆపరేషన్ పూర్తయిన తర్వాత అతను వైద్యుడిని సంప్రదించి, వీడియో కాల్‌లో మాట్లాడాడు. నిన్నటితో షాలినికి ఆపరేషన్ పూర్తి కావడంతో అజిత్ షూటింగ్ పూర్తి చేసుకుని హడావుడిగా చెన్నై చేరుకున్నాడు.

More from Filmibeat

Read more about: shalini ajith kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X