రెండేళ్ల క్రితం చనిపోయిన రజని అభిమాని, 7వ తరగతి.. సూపర్ స్టార్ ఏం చేశాడో తెలిస్తే!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత ఎదిగినా తన సక్సెస్ కు కారణమైన అభిమానులని ఎప్పటికి మరచిపోరు. అందుకే ఆయనని కోట్లాది మంది ఆరాధిస్తారు. రజనీకాంత్ ఎపుడూ అభిమానులని దూరం చేసుకోరు. తరచుగా వారితో సమావేశమవుతూనే ఉంటారు. తాజగా ఓ అభిమాని విషయంలో రజని చేసిన పని ఆయనపై మరింత గౌరవం పెంచేలా చేసింది. రెండేళ్ల క్రితం 7వ తరగతి చదువుతున్న అవినాష్ అనే రజనీకాంత్ వీరాభిమాని మరణించాడు. అతడి కోరికని రజని నెరవేర్చాడు.

రోడ్డు ప్రమాదం
రెండేళ్ల క్రితం 7 వతరగతి చదువుతున్న అవినాష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు వీరాభిమాని. అవినాష్ అవయవాలని అతడి తల్లిదండ్రులు స్వామినాథన్, లత దానం చేశారు.

అవినాష్ కోరిక
సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో అవినాష్ కు ఓ కోరిక ఉండేది. దురదృష్టవ శాత్తు మరణించడంతో ఆ కోరిక తీరలేదు. రజనీకాంత్ చిత్రపటాన్ని అవినాష్ పెన్సిల్ ఆర్ట్ వేశాడు. దానిని సూపర్ స్టార్ కు చూపించి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశపడ్డాడు. మరణముతో ఆ కోరిక తీరలేదు.

రజనికి లేఖ
లేఖ ద్వారా విషయం తెలుసుకున్న రజని అవినాష్ తల్లిదండ్రులని ఇటీవల ఇంటికి పిలిపించుకున్నాడు. వారిని రజని ఓదార్చాడు. అవినాష్ గీసిన చిత్ర పటాన్ని రజనికి చూపించారు. అవినాష్ కోరిక మేరకు రజని దానిపై సంతకం చేశారు.

ఆత్మకు శాంతి
ఇప్పుడు తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూరుతుందని అవినాష్ తల్లి దండ్రులు తెలిపారు. అభిమానులకు ఎప్పుడూ చేరువగావుండే హీరో అంటూ సూపర్ స్టార్ గురించి ఆయన అభిమానులు మరోమారు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











