Jailer యావరేజ్ సినిమా.. కానీ అతడి ప్రతిభ వల్లే బ్లాక్‌బస్టర్.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం పాన్ ఇండియా స్థాయి కలెక్షన్లను కేవలం దక్షిణాదిలోనే రాబట్టింది. సౌత్ సినిమా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల కుంభ వృష్టిని కురిపించింది. ఈ సినిమా చూసిన ఎవరైనా సూపర్ హిట్ అంటూ మొదటి ఆట నుంచే తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే రజనీకాంత్‌కు మాత్రం ఈ సినిమా యావరేజ్‌గా మాత్రమే అనిపించిందట. అయితే జైలర్ సినిమా హిట్ కావడానికి కారణం అతడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైలర్ చిత్రం రజనీకాంత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తమిళం, తెలుగు, ఇతర భాషల్లో కలిపి ఈ సినిమమా 345 కోట్ల రూపాయల షేర్, 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 200 కోట్ల రూపాయులు రాబట్టింది.

Rajinikanth Jailer Movie

జైలర్ చిత్రం సక్సెస్ కావడంతో నిర్మాత కళానిధి మారన్ సంతోషంలో మునిగిపోయాడు. హీరో రజనీకాంత్‌కు, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఖరీదైన కార్లు బహుకరించాడు. ఈ చిత్రానికి పనిచేసిన 300 మందికి బంగారు నాణెలు బహుకరించి తన విజయాన్ని వారితో సన్ పిక్చర్స్ అధినేత మారన్ పంచుకొన్నాడు.

జైలర్ సినిమా భారీ విజయం సాధించడంతో చెన్నైలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తనదైన శైలిలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా సక్సెస్ నా కొడుకు లాంటి అనిరుధ్ వల్లే జరిగిందని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ చెప్పిన మాటలు కొంత ఆశ్చర్యం కలిగించినప్పటికీ.. ఆయన చెప్పిన మాటలు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనిపించింది.

Superstar Rajinikanth gives Jailer Success Credit to Anirudh Ravichanders Music

రజనీకాంత్ మాట్లాడుతూ.. జైలర్ సినిమా రిలీజ్ తర్వాత కన్నన్, సెంబియన్ సెట్‌కు వచ్చారు. కన్నన్ వచ్చి సినిమా బాగుంది అన్నాడు. అయితే నీవు చెబితే నేను నమ్మును. నీవు నెల్సన్ ఫ్రెండ్‌వి కాబట్టి సినిమా బాగుందని చెబుతావు అని అన్నాను. ఆ తర్వాత సెంబియన్‌ను నువ్వు చెబితే వినాలని ఉంది అంటే.. జైలర్ సినిమా యావరేజ్‌గా ఉందని చెప్పాడు. సెంబియన్ చెప్పిన మాటే నాకు నిజమనిపించింది అని రజనీకాంత్ చెప్పారు.

జైలర్ గురించి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే.. రీ రికార్డింగ్ జరగక ముందు సినిమా యావరేజ్ మాత్రమే. కానీ రీరికార్డింగ్‌తో అనిరుధ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. మై గాడ్.. జైలర్ సినిమాను రీరికార్డింగ్‌తో ఆ రేంజ్‌కు తీసుకెళ్లడం పెద్ద ఛాలెంజ్. అనిరుధ్ మ్యూజిక్ ఎలా చేశాడో గానీ మ్యాజిక్ చేశాడు. వాడు నా కొడుకు అనిపించుకొన్నాడు. నాకు భారీ హిట్ ఇచ్చాడు. తన స్నేహితుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు హిట్ ఇచ్చాడు అని రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X