twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ కు ముందే రజనీకాంత్ రికార్డు

    By Staff
    |

    Rajinikanth
    సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న క్రేజ్ ని మరింత హైప్ చేస్తూ సుల్తాన్..ది వారియర్ అనే చిత్రం రానుంది. ఈ త్రీడి యానిమేషన్ చిత్రం పద్దెనిమిది బాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు అరవై కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రంపై అంతటా మంచి హైప్ ఉంది. ఇక ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూతరు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందింది. హాలీవుడ్ ఆర్చర్ స్టూడియో సహకారంతో ఈ చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఇక ఈ చిత్రంలో రజనీ యానిమేషన్ లో కనిపిస్తారు. అందుకోసం రజనీ మొదట ఆ సన్నివేశాల్లో నటించి అనంతరం వాటిని యానిమేషన్ కి మార్చారు.

    అలాగే రజనీ సరసన విజయలక్ష్మి అనే తమిళ నటి యానిమేషన్ కు సరపడ హావభావాలు ఇస్తూ వాయిస్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం భారతదేశంలో తయారైన భారీ యానిమేటెడ్ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే ఒకే సారి పద్దెనిమిది భాషల్లో విడుదలఅవటం కూడా మరో రికార్డే. ఇక రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తే..విడుదల అనంతంరం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీ..ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రొబో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X